Flip కార్ట్..బిగ్ సేల్..మొదలు అయిపోయింది..ఈ 5 రోజులూ..తగ్గింపులే..తగ్గింపులు…

Spread the love

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్..
ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ లో..మరో బిగ్ సేల్‌కు రెడీ అయింది. 🎊Big shopping days: ఈ ఆఫర్ “బిగ్ షాపింగ్ డేస్” పేరుతో బుధవారం (15న) ప్రారంభం అయ్యి 19వ తేదీ {15-5-19 to 19-5-19} వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం రాత్రి 8 గంటల నుంచే సేల్ అందుబాటులోకి రానుండగా, మిగతా వారికి మాత్రం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానుంది.

🎊వీటిపై రాయితీలు :సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, హెడ్‌ఫోన్లు, యాక్సెసరీలు, ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలు ప్రకటించింది. 🎉Cash back : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులకు పది శాతం తక్షణ క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది.
🎊స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ;
📱నోకియా 6.1 ప్లస్ ధరను 12,999కి తగ్గించింది. దీని అసలు ధర 17,999 రూపాయలు.. 📱నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,999కే అందుబాటులో ఉంచింది.దీని అసలు ధర.13,199. 📱శాంసంగ్ గెలాక్సీ జే6 (4జీబీ ర్యామ్/64 జీబీ) ధరను రూ.12,900 నుంచి రూ.9,490కి తగ్గించింది.
📱ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 (4జీబీ+64జీబీ)ను రూ.8,999కి, 📱జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2ను రూ.9,999కి, 📱జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2ను రూ.8,499కి అందుబాటులో ఉంచింది. బడ్జెట్ ధరల విషయానికి వస్తే ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1ను రూ.4,999, లెనోవో ఎ5ను రూ.5,499, ఆనర్ 7ఎస్2ను 5,499కి వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వీటితోపాటు ఆనర్ 8ఎక్స్, ఆనర్ 10 లైట్, ఆనర్ 9 లైట్, ఒప్పో ఎ3ఎస్, షియోమీ రెడ్‌మి 6, రెడ్‌మి వై2 వంటి వాటిపైనా భారీ తగ్గింపు ఆఫర్ చేస్తోంది.
🎊వీటిపై 75% నుండి 80% ప్రత్యేక రాయితీలు:టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు రాయితీ ప్రకటించింది. ల్యాప్‌ట్యాప్‌లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 80 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
👉వీటితోపాటు ఈ సేల్ మధ్యలో ఫ్లాష్ సేల్స్‌ కూడా నిర్వహించనుంది. ఇంకేం ఈ భారీ ఆఫర్స్ ని త్వరగా మీరు కూడా పొందండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *