ఒకేసారి అటు క్రికెట్ గ్రౌండ్ లో ,ఇటు electionప్రచారంలో….
జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ ” సినిమా గుర్తుందా ,ఆ సినిమాలో జరిగిన ఒక సీను ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతుంది .ఆ సినిమాలో జై క్యారెక్టర్ తన లా ఉండే మరో క్యారెక్టర్ ని ఎలక్షన్ ప్రచారంలో దింపుతుంది. అందరూ అది జై అనుకుంటారు . ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఇలాంటి సీనే జరుగుతుందని ఒక నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 👉విషయంలోకి వెళితే దేశ రాజధాని న్యూఢిల్లీలోమరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి . సరిగ్గా ఈ సమయంలో తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణ చేసింది. ఎండ వేడిమిని తట్టుకోలేక అచ్చం తనలా ఉండే మరో వ్యక్తి చేత గౌతమ్ గంభీర్ ప్రచారం చేయిస్తున్నారని ఆప్ నేత, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు . గౌతమ్ గంభీర్ ఏసీలో కూర్చొని, మరో వ్యక్తి చేత ప్రచారం చేయిస్తున్నారని సిసోడియా ఎద్దేవా చేశారు. కాగా.. మనీశ్ సిసోడియా చేసిన వ్యాఖ్యల ప్రకారం ప్రచార సమయంలో లో గౌతమ్ గంభీర్ కార్లో కూర్చొని తనకి బదులు తనలాగే ఉండే నల్లటి టోపీ ధరించిన మరో వ్యక్తితో ప్రచారం నిర్వహిస్తున్నాడని చెప్పారు. నేడు ఎన్నికల ప్రచారంలో నే కష్టపడకపోతే రేపు గెలిచాక ప్రజల కోసం ఏం కష్టపడతారు అని ఎద్దేవా చేశారు. ఇలా అయితే రేపు ఎన్నికలలో నెగ్గాక కూడా గౌతమ్ గంభీర్ ,తన బదులు తన డూప్ ని అసెంబ్లీ కి పంపి , తాను మాత్రం హ్యాపీగా గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటాడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు .మరి ,దీనిపై గౌతం గంభీర్…ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి.