నన్ను డైరెక్ట్ చేసేంత ఉందా నీకు .. ఏంటి హరీష్ నేనేం అడిగానో నీకర్థమైందనుకుంటా … బుర్ర తిరిగుండాలి హరీష్ కి !

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని డైరెక్టర్ చేసే ఛాన్స్ అందుకొని ఊహించని షాకిచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ తర్వా డీజే – గద్దలకొండ గణేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయినా పవన్ అవేవీ పట్టించుకోకుండా ‘గబ్బర్ సింగ్’ తీసిన నమ్మకంతో హరీష్ ని నమ్మి మరో ఛాన్స్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ నేపథ్యంలో హరీష్ తో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో హరీష్ బిజీగా ఉన్నాడు. క్రిష్ తో పవన్ 27 సినిమా పూర్తవ్వగానే.. హరీష్ శంకర్ తో పవన్ 28 ప్రాజెక్ట్ కి డేట్స్ ఇస్తాడట.

ఆ నేపథ్యంలో హరీష్ శంకర్ స్టేట్ మెంట్లు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ‘గబ్బర్ సింగ్’ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పవన్ 28 ఉంటుందని హరీష్ గొప్పలు పోతున్నాడు. అంతేకాదు.. పవన్ సినిమా అవ్వగానే.. మెగాస్టార్ చిరంజీవితోను సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. చిరుతో సినిమానా ..! అంటే.. అది నిజమేనని హరీష్ కన్ఫామ్ చేసేసాడు కూడా. పవన్ కళ్యాణ్ 28 తర్వాత మెగాస్టార్ నే డైరెక్ట్ చేస్తాననని రీసెంట్ గా రివీల్ చేసాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మెగాస్టార్ 153వ సినిమా ఛాన్స్ హరీష్ కే దక్కిందంటూ అంటూ జోరుగా ప్రచారం మొదలైంది. 2021 లో ఈ మెగాస్టార్-హరీష్ ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళతారని చెప్పుకుంటున్నారు.

అయితే హరీష్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చింది నిజమా? చిరు అసలే కథల విషయంలో రాజీకి రావడం లేదు. కొరటాల అంతటి వాడే 152వ సినిమా ప్రకటించాక ఏళ్ల తరబడి ఎదురు చూశారు. 153వ సినిమా అంత సులువుగా హరీష్ కి కమిటైపోతారా? అన్న డైలామా అభిమానులకు ఉంది. గతంలో పూరి జగన్నాథ్ విషయంలో ఇలానే జరిగిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ‘ఆటో జానీ’ స్క్రిప్ట్ సగం వినిపంచి డ్రాప్ అయ్యాడు పూరి.

చిరు మార్పులు కోరినా పూరీని రిజక్ట్ చేశారంటూ ప్రచారమవ్వడంతో హర్టయిన పూరి సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. అయినా చిరు కోసం ఇప్పటికీ పూరీ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. అయితే హరీష్ కూడా చిరుతో ఫలానా నంబర్ నాదే అని చెప్పుకుంటున్నాడు తప్ప అంత సీన్ లేదని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అంతేకాదు కథ వినమని చిరు దగ్గరకి హరీష్ వెళితే నన్ను డైరెక్ట్ చేసేంత ఉందా నీకు అని చిరు అడగడం ఖాయం అంటూ కూడా ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *