హిప్పీ రివ్యూ : మరో Rx100 కాకపోయిన హిప్పీ

Spread the love

R x 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా హిప్పీ. ఆర్‌ఎక్స్‌ 100లో బోల్డ్‌ సీన్స్‌తో రెచ్చిపోయిన కార్తీకేయ హిప్పీలోనూ అదే ఫార్ములా కంటిన్యూ చేశాడు. తమిళ స్టార్ ప్రొడ్యూసర్‌ కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో కధ లోకివెళ్లి చూద్దాం.

🌟స్టోరీ ఇది :దేవదాస్ అలియాస్ హిప్పి (కార్తీకేయ) జాలీగా లైఫ్‌ను ఎంజాయ్ చేసే యువకుడు. బీటెక్ తర్వాత ఖాళీగా ఉన్నానని స్నేహా (జెస్బా) ప్రపోజ్ చేస్తే అంగీకరించి ముద్దు మురిపాలు సాగిస్తూ కాలంతోపాటు ముందుకెళ్తుంటాడు. స్పూర్తితో ఎంజాయ్ చేస్తూనే ఆముక్త మాల్యద ( దిగంగన సూర్యవంశీ)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆముక్త మాల్యద పొసెసివ్‌నెస్ కారణంగా జీవితంలో స్వేచ్ఛ కరువుతుంది. వారిద్దరి మధ్య చిన్న గొడవలు, అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. దాంతో తాను ఇష్టంగా ప్రేమించిన ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు.

🌟నటీనటులు :
🔥కార్తికేయ :
హిప్పీలో ఈ యంగ్‌ హీరో స్టైలిష్‌ మేకోవర్‌తో ఆకట్టుకున్నాడు.ఆర్‌ఎక్స్‌ 100లో పిచ్చి ప్రేమికుడిగా ఒకే ఎమోషన్ లో కనిపించిన కార్తికేయకు ఈ సినిమాలో వేరియేషన్స్‌ చూపించే అవకాశం దక్కింది. లుక్స్‌తో పాటు నటనపరంగానూ మంచి మార్కులు సాధించాడు. కేవలం రొమాంటిక్ గానే కాదు.. యాక్షన్, ఎమోషనల్, ఎంటర్‌టైన్ చేసే ప్రతీ అంశంలో సత్తా ఉందనే విషయాన్ని దేవదాస్ క్యారెక్టర్ చెప్పాడు. సిక్స్ ప్యాక్ బాడీతో ఫైట్స్, పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇరుగదీశాడు. ఎమోషనల్ సీన్లోను, డైలాగ్ డెలివరీలోనూ తన స్టామినాను రుచి చూపించాడు.

💚దిగంగన సూర్య వంశీ:  స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.కేవలం అందంతోనే కాదు అభినయంతోను ఆకట్టుకొన్నది. క్లాస్, మాస్, గ్లామర్ షేడ్స్‌ను ఆముక్త మాల్యద పాత్రతో చూపించింది. వెస్ట్రన్ లుక్‌లో ఎంత క్రేజీగా కనిపించిందో.. సంప్రదాయమైన రూపంలో కూడా అంతే ఆకట్టుకొన్నది. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్‌ను బాగా పలికించింది.

🔹లవ్ గురు గా జేడీ : మరో కీలక పాత్రలో నటించిన జేడీ చక్రవర్తి, తన అనుభవంతో అరవింద్‌ పాత్రను అవలీలగా పోషించాడు. ప్రేమలో విఫలమై.. యూత్‌కు లవ్ గురు లాంటి క్యారెక్టర్‌లో నటించాడు. ఈ సినిమాకు జేడీ స్పెషల్ ఎట్రాక్షన్. చివర్లో సున్నితమైన ఎమోషన్స్‌ను పలికించి ప్రేక్షకుల అటెన్షన్‌ను తనపైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు.
🌟కామెడీ బాగుంది :
వెన్నెల కిశోర్‌ తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు. ఇతర పాత్రల్లో జజ్బా సింగ్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

🌟విశ్లేషణ :

హిప్పి మూవీ పక్కా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. తొలిభాగంలో కొంత నింపాదిగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లో ఎమోషన్స్, రొమాన్స్, హ్యూమర్ లాంటి అంశాలు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. కార్తీకేయ, దిగంగన కెమిస్ట్రీ స్పెషల్ ఎట్రాక్షన్. జేడీ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ పరంగా బాగానే ఉన్నా కథనం మాత్రం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. కామెడీ బాగానే వర్క్‌ అవుట్ కావటం కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫి బాగుంది. నివాస్‌ కే ప్రసన్నా సంగీతం పరవాలేదు. పాటలు విజువల్‌గా బాగున్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాలా సన్నివేశాలు బోర్‌ ఫీలింగ్‌ కలిగిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తారాగణం : కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జజ్బా సింగ్‌, వెన్నెల కిశోర్‌

🎻సంగీతం : నివాస్‌ కే ప్రసన్న

🎥దర్శకత్వం : టీఎన్‌ కృష్ణ

💰నిర్మాత : కలైపులి ఎస్‌ థాను

✂ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్

🎬బ్యానర్: వీ క్రియేషన్ర్‌ఎక్స్‌

💚ప్లస్‌ పాయింట్స్‌ :

🔹కార్తీకేయ ఫెర్ఫార్మెన్స

🔹జేడీ చక్రవర్తి

🔹దిగంగన గ్లామర్

🔴మైనస్‌ పాయింట్స్‌ :

🔹డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌

🔹స్లో నేరేషన్‌

🌟 రేటింగ్: 2.5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *