నిన్నటి వరకు పాన్ కార్డ్ కావాలంటే రెండుమూడు వారాలు ఎదురుచూడాల్సి వచ్చేది . ఈలోపు పాన్ కార్డు తో అవసరం ఉండే పనులు ఏవైనా అర్జెంట్ గా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది . ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసే పాన్ కార్డ్… ఆర్థిక వ్యవహారాలు జరిపేవారందరికీ కావాల్సిన డాక్యుమెంట్. వ్యక్తులకే కాదు కంపెనీలకూ పాన్ కార్డులు జారీ చేస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. పాన్ కార్డ్ ఉంటేనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం. సాధారణం గా పాన్ కార్డు మీకు పోస్ట్‌లో రావాలంటే 15 నుంచి 20 రోజులు పడుతుంది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత పాన్ కార్డు పొందడం సులువైపోయింది.
🔸తత్కాల్ పాన్ అప్లికేషన్ : ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొన్ని సులువైన స్టెప్స్‌తో మీరు వెంటనే కావాలన్నా పాన్ కార్డ్ ని పొందొచ్చు.
👉బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ దరఖాస్తు కోసం మీకు వెంటనే పాన్ కార్డు కావాలంటే కేవలం 48 గంటల్లో పొందొచ్చు. అంటే ఇది తత్కాల్ పాన్ అప్లికేషన్ లాంటింది. ఫామ్ 49ఏ లేదా ఫామ్ 49ఏఏ దరఖాస్తు ద్వారా మీరు వెంటనే పాన్ కార్డు పొందొచ్చు. ఎన్ఎస్‌డీఎల్ అధికారిక వెబ్‌సైట్ www.tin-nsdl.com లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లేదా పాన్ కేంద్రం నుంచి పాన్ దరఖాస్తు ఫామ్ తీసుకోవచ్చు. ఈ దరఖాస్తును ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
👉ఈ విధంగా చెయ్యాలి :దరఖాస్తు ఫామ్‌ను బ్లాక్ ఇంక్‌తో ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్‌తో పూర్తి చేయాలి. ♦వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో రెండు కలర్ ఫోటోలు అతికించాలి.
👉ఇవి జత చెయ్యాలి : డేట్ ఆఫ్ బర్త్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ జత చేయాలి. బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆదార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డు లాంటివి జత చేయొచ్చు. 👉మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వివరాలు రాయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే డిజిటల్ సిగ్నేచర్ తప్పనిసరి.
👉ఫైనల్ గా రెండు రోజుల్లోనే ఇ-పాన్ :
తప్పులు లేకుండా పాన్ కార్డ్ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేస్తే మీకు ఫిజికల్ కార్డ్ వచ్చే లోపు ఇ-పాన్ జారీ అవుతుంది. మీ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ద్వారా మీ పాన్ కార్డ్ దరఖాస్తును ట్రాక్ చేయొచ్చు. రెండు రోజుల్లోనే మీకు ఇ-పాన్ జారీ అవుతుంది. అత్యవసరమైతే ఇ-పాన్ ఉపయోగించుకోవచ్చు. అదండీ ఈ ఇ-పాన్ సంగతి. ఇక నుండి అర్జెంటుగా పాన్ కార్డు కావాల్సి వస్తే ఇలా ట్రై చేసేయండి.*