అవును మీరు తీసుకునే ఆహారాన్ని అవి తినేస్తాయ్.అవి నులిపురుగులు.కానీ చాలా మందికి వీటి వల్ల జరిగే నష్టాలు తెలియవు. నులిపురుగుల పై అవగాహన కు సంబంధించి ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఏటా నులిపురుగులకు సంబంధించి నిర్మూలన దినోత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూనే ఉంది.పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి నులిపురుగులు. పిల్లల్ని ఆరోగ్యాన్ని ఇవి పూర్తిగా దెబ్బతీస్తాయి. అసలు ఇవి శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి. ఒకవేళ ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఒకసారి చూడండి.ఈ పురుగులన్నింటినీ నివారించే మందు ఆల్బెండజోల్. ఈ మాత్రలు వేసుకుంటే చాలు ఎలాంటి పురుగులైన చచ్చి మలవిసర్జనలో బయటకి వెళ్లిపోతాయి. అయితే పిల్లలకు ఈ మాత్రలు వేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఎక్కువ డోస్ వాటిని పిల్లలకు వేయకూడదు. కళ్లు తిరిగిపడిపోతారు. అలా అని భయపడాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బందులుపడుతుంటారు. మీరు తినే తిండిని మొత్తం కూడా నులిపురుగులు తినేస్తాయి. నులిపురుగుల్లోనూ చాలా రకాలుంటాయి. చాలా మందిలో ఏలిక పాములుంటాయి. అలాగే కొంకి, నులి అనే రకం పురుగులు కూడా ఉంటాయి.
👉లక్షణాలు :
ఆకలి సరిగ్గా వేయదు. ఎక్కువగా బలహీనంగా మారుతారు. తరుచుగా కడుపునొప్పి వస్తూ ఉంటుంది. బరువు పెరగరు. చాలా మంది బక్కగా ఉండే వారు నులిపురుగుల సమస్య బారినపడి ఉంటారు. కానీ వారికి ఈ విషయం తెలియక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా వారు ఎంత తిన్నా కూడా లావుకారు.అలాగే నిత్యం శుభ్రతను పాటించాలి. ఆల్బెండజోల్ మాత్రలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో , అంగన్ వాడీల్లో ఉచితంగా ఇస్తారు. మీరు కూడా నులిపురుగులకు సంబంధించిన లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆ రోగాన్ని నయం చేసుకోండి.మీ ఆహారాన్ని మీరే తినండి..