సిడ్నీ : చూయింగ్ గమ్ తినడాన్ని చాలా మంది ఇష్టపడతారు. మరి ముఖ్యం గా చిన్నారులు, యువత వీటిని ఎక్కువగా తింటారు. ఐతే రుచికి తియ్యగా ఉండే ఈ చూయింగ్ గమ్ వల్ల ఆరోగ్యానికి హాని ఉంది అని పరిశోధకులు చూయింగ్ గమ్ మీద పరిశోధనలు చేసారు. చాలా మంది వీటిని చాక్లేట్ లా ఎప్పుడు తింటూ నే ఉంటారు.
ఆస్ట్రేలియా లో ని సిడ్నీ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకుడు పరిశోధన చేసాడు. ఇవి తినడం వల్ల శరీరంలో లో రక్త శాతాన్ని తగ్గిస్తుంది. నిత్యం తినడం వల్ల కొలన్ కాన్సర్ వస్తుంది అని పరిశోధనలో తేలింది. కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని పరిశోధనల్లో చెప్పారు.
ఈ చూయింగ్ గమ్ లో ” ఈ 171″ ( టైటానియం డై ఆక్సైడ్ నానో పార్టికల్స్ ) అనే పధార్ధం ఉంటుంది. క్రమం గా ఇది పేగు ల కు హాని చేస్తోంది అని నిర్ధారించారు. ఆహారం, మందుల్లో తెలుపు రంగు లో ఉండేదుకు ” ఈ 171 ” ఈ పదార్థం ఉపయోగిస్తారు. అందుకే ” ఈ 171 ” వాడే పదార్దాలకు దూరం గా ఉండటం మేలు అని పరిశోధకులు సూచిస్తున్నారు.