గాజు మాది నిర్ణయం మీది అంటూ తొలిసారి ఎన్నికల్లో పోటికి దిగిన జనసేన అధ్యక్షుడు పవన్‌కు ap లో ఊహించని షాక్ తగిలింది. 👉ఏపీలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకున్న జనసేన అధినేత పవన్‌కళ్యాన్‌కు ఏపీ ఓటరు అదిరిపోయే షాక్ ఇచ్చారు. మార్పు కోసం ఓటేయండి అన్న జనసేనాని మాటలను ఆంధ్రప్రజలు తిరస్కరించారు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ తొలి రౌండ్ నుంచే వెనుకంజలో ఉన్నారు.
పవన్ తన గెలుపు కోసం అనువైన స్థానాలు భీమవరం, గాజువాకను ఎంచుకుని మరీ పోటీలో దిగారు. పవన్ ఈ రెండు చోట్ల గట్టి ఎదురు దెబ్బే తగిలింది. రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తేయ్యే సరికి జనసేనాని ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు.
👉భీమవరంలోనూ గ్లాస్ వెనుకంజ : వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ సుమారు వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఇక గాజువాకలో తిప్పల నాగిరెడ్డిలు ముందంజలో ఉన్నారు. ఈ ఇద్దరు భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. వైఎస్ జగన్ చరిష్మా ముందు పవన్ స్టార్డమ్ కొట్టుకుపోయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ జోరు కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. 👉మొత్తానికి గాజు గ్లాసు పూర్తిగా adress లేకుండా పోతుంది.