నిద్రమత్తులో డ్రైవర్‌; కాలువలోకి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

Spread the love

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద  ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్‌ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్‌ ప్లేట్‌ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *