తోకచుక్కలు ఆకాశంలో కనిపించిన సమయంలో భూమిమీద చెడు సంఘటనలు జరుగుతాయని పురాణాలలో చెప్పబడి ఉన్నది.
🔅ముఖ్యంగా మహాభారతం విషయానికి వచ్చినట్లయితే ద్వాపరయుగాంతం
సమయంలో మానవులలో దురహంకారం, దుష్టత్వం పెరిగిపోయాయి.ఆ కారణంగానే కౌరవ-పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది.ఆ తరువాత కాలంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన యాదవులలో కూడా అనైతికత మరియు అరాచకత్వం ప్రబలిపోయాయి. అలాంటి సమయంలో మహరుషుల శాపం కారణంగా యాదవులు ఒక పండుగ సమయంలో సముద్ర తీరంలో ఏదో ఒక విషయంలో గొడవపడి, చివరికి ఆ గొడవ ముదిరి ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారు. ఆవిధంగా యాదవ వంశం అంతమయిపోయింది.
ఆ చావులకు కారణం మహాభారత యుద్ధ సమయంలో ఒక పెద్ద తోకచుక్క పుష్యమీ నక్షత్ర
మండలంపై భాగంలో కనిపించడమే అని వ్యాసమహర్షి మహాభారత గ్రంధం లో రాశారు.
భారతీయ ఖగోళశాస్త్ర గ్రంధాలలో వ్రాయబడిన సమాచారప్రకారం చూసినట్లయితే తోకచుక్కలు దాదాపు 500 ఉన్నాయి. వాటిలో పెద్ద తోకచుక్కలు చాలా కొద్దిగా ఉన్నాయి. అలాంటి పెద్ద తోకచుక్కలో “హేలీతోకచుక్క కూడా ఒకటి అని చెబుతారు. ఈ తోకచుక్క ప్రతి 77సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో కనిపిస్తుంది. గతంలో క్రీ.శ.1910 మరియు క్రీ.శ.1987 సంవత్సరాలలో ఈ తోకచుక్క కనిపించింది.మహాభారత యుద్ధ సమయంలో కనిపించిన తోకచుక్క హేలీ అయిఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకు కారణం ఏమంటే..| మహాభారతయుద్ధం క్రీ.పూ. 5561వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు
జరిగిన మారణహెూమానికి సూచికగా ఆ సమయంలో హేలీతోకచుక్క కనిపించింది.
మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది సైనికులు, గుర్రాలు, ఏనుగులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది .అదండీ హేలీ తోకచుక్క ప్రభావం.