సినిమాలు చూసి వాటిని రియల్ లైఫ్ లో కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మందే. ఎందుకంటే ఆ సినిమాల్లోని ఏదోక విషయం..ఆ followers ని ఆకర్షిస్తుంది. తాజాగా ‘మహర్షి’ కాన్సెప్ట్ ని కూడా కొంత మంది ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. 👉విషయం లోకి వెళ్తే : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9 వ తారీఖున విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా ఒక విషయం మాత్రం చాలా మందిని ఆకట్టుకుంటుంది. అది ఏంటంటే 👉రైతు లా వ్యవసాయం చేయడం : ఈ సినిమాలో వ్యవసాయం మన జీవితంలో ఒక భాగమని.. రైతన్నలకు మనం గౌరవం ఇవ్వాలనే సందేశం మాత్రం అందరినీ మెప్పిస్తోంది. దాంతో సొసైటీ లో ఒక సరికొత్త ట్రెండ్ వచ్చినట్టు తెలుస్తుంది.
అది 🌾వీకెండ్ ఫార్మింగ్ : రైతు గా వ్యవసాయం చెయ్యడం అనే పాయింట్ కి ఇన్ స్పైర్ అయిన కొందరు వీకెండ్ ఫార్మింగ్ అంటూ ఇప్పటికే పొలం పనులు చేస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. యువకులే కాదు.. కొన్ని స్కూల్స్ కూడా వ్యవసాయంపై పిల్లలకు అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నాయని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 👉నమ్రత ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై విమర్శలు : “మహర్షి ఒక మార్పు.. ఒక ప్రభావం.. ఒక పాఠం.. ఇంకా ఎక్కువ. ఈ స్పందనకు చాలా సంతోషంగా ఉంది. అక్కడున్న అందరూ మహర్షులకు హ్యాట్స్ ఆఫ్” అంటూ మహేష్ సతీమణి నమ్రత ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటో పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయ్. 🔸ఎందుకంటే :
ఆ ఫోటోలో స్కూల్ స్టూడెంట్స్ పొలంలో బురదలో దిగి నాట్లు వేస్తూ ముచ్చటగా ఉన్నారు. ఈ ఫోటో పైన ఒక స్కూల్ ఇలా పిల్లలను వ్యవసాయం దిశగా ప్రొత్సహిస్తోందని రాసి ఉంది.” 👉ఇలా రాయడమే విమర్శలకు కారణం అయ్యింది. ఎందుకంటే అసలే ఇది నడి వేసవి. అన్ని స్కూల్స్ కు శెలవులు. ఈ సమయంలో పిల్లలను పొలం బాట పట్టించిన ఆ స్కూల్ ఎక్కడుందని.. ఆ స్కూల్ పేరు కూడా చెప్తే బాగుంటుందని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో కొన్ని కార్పోరేట్ స్కూల్స్ లో ఫార్మింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఫోటో అలాంటి క్లాసులు జరిగినప్పటిదే.. పాతదే అయి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు తన ఖాతా ద్వరా షేర్ చేసేముందు ఒకసారి నమ్రత గారు చెక్ చేసుకోవడం మంచిందని కొందరు సూచిస్తున్నారు.
అయితే నమ్రత షేర్ చేసిన మరో ఫోటో మాత్రం జెన్యూన్ గానే ఉంది. ఎందుకంటే అది వికారాబాద్ సమీపంలో ఉన్న ఫామింగ్ స్కూల్ లో పిల్లలు పొలం పనులు చేస్తున్న ఫోటో. ఫార్మింగ్ స్కూల్ గతంలో కూడా అక్కడ ఉన్నప్పటికీ ‘మహర్షి’ రిలీజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళే పిల్లల సంఖ్య పెరిగిందట. పుణ్యం పురుషార్థం లాగా ఈ ఫార్మింగ్.. అటు సమాజానికి మంచి మెసేజ్ ఇటు మహర్షి కి క్రేజ్ పెంచాలనే ఈ తతంగం అంతా అంటున్నారు కొంత మంది విమర్శకులు.ఏది ఏమయితేనే..ఒక మంచి పని ఇలాంటి ప్రమోషన్ ల తో చక్కగా జనాల్లోకి వెళ్తుంది.