వామ్మో..మోదీ మేకప్ ఖర్చు..నెలకు 80 లక్షలా..!!?

Spread the love

మోదీ తన డ్రెస్సింగ్ కు, ఆహార్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తరన్న విషయం అందరికీ తెలిసిందే. దాన్ని బలపరుస్తున్నట్టుగా తాజాగా ప్రధాని నరేంద్ర మోడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. ఆవీడియోలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం మోదీ నెలకు 80 లక్షలు ఖర్చు చేస్తారని అని ఉంది. ఈ వీడియో ఫేస్‌బుక్ లోలక్షల్లో ట్రెండ్ అయింది. విపక్ష పార్టీలన్నీ ఫేస్‌బుక్ పేజీల్లో ఈ వీడియో షేర్ చేశారు.

👉ఫేక్ వీడియో : కానీ ఈ వీడియో ఫేక్ అట. వాస్తవానికి వీడియో ఉన్నమాట నిజమైనా దానినుద్దేశించి ఉన్న సమాచారం మాత్రం అబద్ధమట. ఈ వీడియోలో పేర్కొన్నట్లు మోదీ మేకప్ ఆర్టిస్టులతో మేకప్ వేయించుకోవట్లేదు.

🎉అసలు విషయం వేరే : 2016లో మోదీ మైనపు విగ్రహం తయారు చేసేందుకు మేడం టుసాడ్స్‌ బృందం ప్రధాని నివాసానికి వెళ్లింది. అక్కడే మోదీకి సంబంధించిన కొలతలను వారు తీసుకున్నారు. పైగా మోదీకి మేకప్ వేయట్లేదు.
👉మోదీ మైనపు విగ్రహం :
మైనపు విగ్రహం తయారీ కోసం మోదీ ముఖం, శరీరం కొలతలను తీసుకున్నారు. నిజమైన వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో చూడొచ్చు. 2016 ఏప్రిల్ లో మోదీ మైనపు విగ్రహాన్ని లండన్‌లో ప్రతిష్ఠించారు. ఆ వివరాలు కూడా ఉన్నాయి, ఆర్టీఐ ద్వారా అందరూ తెలుసుకున్న సమాచారం ప్రకారం మోదీ తన మేకప్ కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చు చేశారని తేలిందని ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇది అవాస్తవం.. మోదీపై వచ్చిన ఆర్టీఐ ప్రశ్నల గురించి ప్రధానమంత్రి అధికార వెబ్‌సైట్లో పరిశీలిస్తే అందులో మోదీ మేకప్ ఖర్చు వివరాలపై ప్రస్తావన లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *