డ్రగ్స్ కేసు .. తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు!బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ ఏర్పడుతుంది..
డ్రగ్స్ కేసు .. తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ ఏర్పడుతుంది.. ముందుగా ఈ కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఎన్‌సీబీ విచారణలో 25 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించిందని వార్తలు వచ్చాయి
.. అందులో రకుల్, సారా ఆలీఖాన్ పేర్లు ఉన్నట్టుగా తాజాగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా అధికారికంగా వెల్లడించారు. వీరితో పాటుగా మరికొందరి పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. అందులో మొన్నటి నుంచి శ్రద్ధాకపూర్ వినిపిస్తోంది.. ఇప్పుడు ఈ లిస్టు నుంచి స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు వినిపిస్తోంది.
జయా సాహాను విచారించగా స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చినట్లు ప్రముఖ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. జయ వాట్సాప్ చాట్ చేసిన దాన్ని బట్టి ఆమె దీపికా పర్సనల్ మేనేజర్ కరిష్మా డ్రగ్స్ గురించి చర్చించిందని ఎన్‌సీబీ అధికారుల దృష్టికి వచ్చింది. అందులో ఉన్న కోడ్ భాషలో D అంటే దీపిక అని, K అంటే కరిష్మా అని అనుమానిస్తోంది ఎన్‌సీబీ అధికార బృందం. త్వరలోనే దీపిక పదుకొనే, శ్రద్ధాకపూర్‌లకు ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. అటు రకుల్‌ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబాటాలకు ఈ వారంలోపు సమన్లు జారీ చేయనున్నట్లుగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఒకరు మీడియాకు వెల్లడించారు.