మనిషి లా మ్యూజిక్ వినే ఆవు..
ఈ భూమి మీద మనం నమ్మలేని,మనకు తెలియని వింతలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి.ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు..కొన్ని జరిగాయి కూడా. గతం లో కోతి, పాము మొదలైన జంతువులు వింతగా ప్రవర్తించడం చూసాం.
👉👉👉👉విషయం లోకి వెళ్తే … మామూలుగా కుక్కలు మనతో కలిసిమెలిసి ఉంటాయి. అలాంటిది తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఉన్న ఆంబూరులో…ఒక ఆవు మాత్రం అచ్చం మనిషిలా ప్రవర్తిస్తోంది. వీరాకుప్పంకి చెందిన ఆనందన్ ఇంట్లోని ఆవుకు ఈమధ్యే మగ దూడ పుట్టింది. 👉ఈ ఆవు దూడ ప్రత్యేకతలు : నడవడం వచ్చినప్పటి నుంచీ ఈ దూడ చిత్రంగా ప్రవర్తిస్తోంది. ఇంట్లో వాళ్లు తాగే మంచినీటిని మాత్రమే తాగుతోంది. 🔅మనుషులు పడుకునే చోటికి వచ్చి, చాప, దిండు ఉన్న చోట మాత్రమే పడుకుంటోంది. అది కూడా మనిషిలా నిద్రపోతోంది. 🔅చిరు తిళ్ళు తింటుంది : మామూలుగా ఆవులు చిరుతిళ్ల వంటివి తినవు. ఈ లేగ దూడ మాత్రం… పిల్లలు చిరుతిళ్లు తినేటప్పుడు నాక్కూడా పెట్టరా అన్నట్లు చూస్తోంది. వాళ్లు జాలి పడి పెడితే… కరకరలాడిస్తూ తింటోంది. ఇదెక్కడి వింతరా బాబూ అనుకుంటున్నారు వాళ్లు.
ఈ చిత్రాలన్నీ చూసి ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులకు మరో షాకిచ్చింది ఈ పిల్ల దూడ. 🔅ఈ దూడ మ్యూజిక్ వింటుంది.మ్యూజిక్ లవర్సైన ఇంట్లోవాళ్లు సహజంగానే స్పీకర్లు ఏర్పాటు చేసుకున్నారు. వాటిలోంచీ సాంగ్ వచ్చినప్పుడల్లా… ఈ దూడ డాన్స్ చేస్తోంది. వాళ్లంతా షాకై చూస్తున్నారు. దీనికి ముద్దుగా “వేలన్” అనే పేరు పెట్టారు.
👉ఆకలేసినప్పుడు అమ్మ దగ్గరకు వెళ్లి… మిగతా టైమంతా ఇంట్లో వాళ్లతో గడిస్తోంది ఈ ఆవు.ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది. క్రమంగా ఊరంతా తెలిసింది. అందరూ ఈ ఇంటికి వచ్చి… దూడను రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీసుకుంటున్నారు. కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఇలా ఈ దూడ ఎందుకు మనిషిలా ప్రవర్తిస్తోందో ఎవరికీ తెలియట్లేదు.చిన్నప్పుడు మనుషులకైనా, జంతువులకైనా చుట్టూ ఉన్న పరిసరాల్ని చూసి నేర్చుకునే అలవాటు ఉంటుంది. ఆ క్రమంలో ఈ దూడ కూడా ఇంట్లో వాళ్లను చూసి… వాళ్లలాగే చేస్తూ… కొత్త విషయాలు నేర్చుకుంటోందని అంటున్నారు పరిశోధకులు. కొంత మంది మాత్రం పూర్వజన్మలో..ఆ దూడ ఆ ఇంటి లొని ఒక వ్యక్తి అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు.