పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చి .. వరుసగా సినిమాలు మొదలు పెట్టబోతున్నాడు. ఒకటి కాదు రెండు .. ఏకంగా నాలుగు సినిమాలు క్యూ లో ఉన్నాయి. ప్రస్తుతం అయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం హైద్రాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నవిషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ ఏప్రిల్ తో పూర్తీ అవ్వడం .. మే లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి ఈ చిత్ర టీమ్ అప్పుడే రెడీ అయిపోయింది.
పవన్ ఫాన్స్ ఏంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా ..
మార్చ్ 2న ? ఏంటి షాక్ అవుతున్నారా. మీరు వింటున్నది నిజమే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ న్యూ లుక్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఓ రేంజ్ లో ఉంది .. అందుకే పవన్ లుక్ ని రిలీజ్ చేస్తే సినిమాకు మరింత హైప్ తేసుకురావచ్చు అన్న ఆలోచనలో ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారట. అన్నట్టు ఈ సినిమాకు `వకీల్ సాబ్` అనే టైటిల్ కు ఫిక్స్ చేసేలా ఉన్నారు. ఇప్పటికైతే టైటిల్ విషయంలో కొత్త పేర్లు ఏవి వినిపించకపోవడంతో ఈ టైటిల్ ఓకే అవుతుందని అంటున్నారు.
ఈ చిత్రంలో అంజలి, నివేద థామస్ , అనన్య లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ చాలా గ్యాప్ తర్వాత పవన్ తెర మీదకి రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. అయితే ఈ చిత్రంతో పాటు పవన్ క్రిష్ సినిమాకి కూడా ప్లాన్ చేసేస్తున్నారు. దీంతో పాటు ఇటీవలె ఆయన పూరి సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.