శ్రీకాకుళం జిల్లా సిక్కోలుకు చెందిన మత్స్య కార్మికులు గుజరాత్ లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఉన్న కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో వారికి అక్కడ అన్న, పానీయ సదుపాయాలు అందడం లేదు. ఇప్పుడు వారిని వెనక్కి తీసుకురావడం కష్టమే అయినా..వారిని ఆదుకోండి. వీలైనంత త్వరగా మత్స్యకారుల్ని తిరిగి రాష్ట్రానికి తీసుకురండంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
‘ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపం:
గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల,శ్రీకాకుళం మత్స్యకారులని, రాష్ట్రం కి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి.
గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల శ్రీకాకుళం మత్స్యకారులుని ఆదుకోండి. లాక్ డౌన్ పరిస్థితులిని అర్థం చేసుకోగలం. కనీసం సంబంధిత జిల్లా మంత్రులిని కానీ ఉన్నతాధికారులుని గుజరాత్ పంపించండి, వారికి భరోసా యివ్వండి, ఏ మాత్రం అనుకూల పరిస్థితులు ఉంటే, రాష్ట్రం కి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి.’
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపం:
గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల,శ్రీకాకుళం మత్స్యకారులుని,
రాష్ట్రం కి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి
గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల శ్రీకాకుళం మత్స్యకారులుని ఆదుకోండి. లాక్ డౌన్ పరిస్థితులిని అర్థం చేసుకోగలం