R.నారాయణ మూర్తి పేరు వినగానే ఒకప్పుడు కర్షక, కార్మికుల కోసం ఆయన తీసిన ఎర్రసైన్యం, దండోరా, చీమల దండు, ఒరేయ్ రిక్షా వంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. నారాయణ మూర్తి కెరీర్ మొదట్లో సాటిలేని మేటి చిత్రాలు అవి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక… అయన సినిమాలు తీయడం తగ్గించేశారు. ఇప్పటి తరానికి అనుగుణంగా ఆయన సినిమాలు చేయలేరు. ఒకవేళ తన తహారలోనే సినిమాలు చేసినా చూసేవాళ్ళు కరువు.
అందుకే నారాయణ మూర్తి సినిమాలు చేయడం తగ్గించేశారు. ఇప్పుడు మరలా మెగాఫోన్ పట్టుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నా రూ “అంగట్లో ప్రజాస్వామ్యం” పేరుతో రాయకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సినిమా చేశారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది. దీనికి సంబంధించిన ఆడియో వేడుక మంగళవారం రోజున ప్రసాద్ లాబ్స్ లో జరగబోతున్నది.
👉ఆడియో వేడుకకు మెగాస్టార్:
ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నారు. సాధారణం గా రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో సినిమా పై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. కానీ ఆడియో వేడుకకు మెగాస్టార్ వస్తుండడం తో ఈ సినిమాకు ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో మార్కెట్ పరంగా సినిమాకు మైలేజ్ కూడా వస్తుంది. అత్యవసర సమయం లో మెగాస్టార్ ఈ రకంగా సపోర్ట్ చేయడం నారాయణ మూర్తి కి చాలా మంచి చేసినట్లే,ఆదుకున్నట్లే..అంటున్నారు తెలిసిన వారు.