సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఇటుకలు సిమెంట్ ఉపయోగిస్తారు. దాని వల్ల పర్యావరణానికి ఏ ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ వీళ్లు కట్టే ఇల్లుమాత్రం పర్యావరణాన్ని రక్షిస్తాయి . ఇల్లు కట్టి పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవచ్చు అనుకుంటున్నారా అయితే ఇది చదవండి ..
👉వాళ్ళు వాటర్ బాటిల్స్ తో ఇళ్ళని కడతారు .
మనం ప్లాస్టిక్ బాటిల్ లను వాటర్ త్రాగడానికి లేదా వేరే వాటికి ఉపయోగిస్తాం. కానీ వీళ్లు మాత్రం ఏకంగా బాటిల్స్ తో ఇళ్లను కడుతున్నారు. అయితే మనం రోజూ చాలా బాటిల్స్ ని బయట పడేస్తాం. అందులో కొన్నిటిని రీసైకిల్ చేస్తారు.మరికొన్ని అలాగే భూమిలో ఉండిపోతాయి. అలా భూమిలో ఉండిపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అవి భూమిలో కలిసి పోవడానికి చాలా ఏళ్లు పడుతుంది.ఈ లోపు ఆ భూమి ఈ ప్లాస్టిక్ వల్ల కెమికల్ మయమై విషపూరితమౌతుంది..అక్కడ చెట్లు, పంటలు కూడా సరిగ్గా పండవు.చెట్లు లేకపోతే అక్కడి పర్యావరణం విషపూరిత వాయువులతో కలుషితమౌతుంది . ఆలా జరగకూడదని వీళ్లు అలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ని ఉపయోగించి అందమైన ఇల్లు కడుతున్నారు . ఇంకా వీటి కి తోడుగా ఇటుకలు లేకుండా, రాళ్లు లేకుండా, ఎడారి ఇసుకను ఉపయోగించి ఇటువంటి ఇళ్లను కడుతున్నారు.ఇవి మన ఇంటి లాగా గట్టిగా ఉండక పోవచ్చు.కానీ తక్కువ ఖర్చుతో,పనికి రాని వాటిని కూడా పనికొచ్చేలా చేస్తున్నారు.ఇది చూసాక ఇలాగా కూడా ఇల్లు కడతారా అనిపిస్తుంది కదూ..వీళ్ల ను మెచ్చుకోవా లని అనిపిస్తుంది కదూ…