పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఫ్యూచర్ అందరికంటే ముందుగా తెలుస్తుంది. 👉తక్కువ రౌండ్లు ఉండే కేంద్రాలు ; ఈ 2 నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు అయిపోతుంది. 👉ఎక్కువ రౌండ్లు ఉండే కర్నూలు ; కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు ఉన్నందువల్ల ఫలితం మిగతా వాటికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
👉కౌంటింగ్ ఏర్పాట్లు : సాధారణంగా కౌంటింగ్ హాళ్లలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈసారి ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు కౌంటింగ్ హాళ్లను బట్టీ టేబుళ్ల సంఖ్యను పెంచుకోవచ్చని ఈసీ తెలిపింది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు టేబుళ్లున్నాయి. అందువల్ల ముందుగా చిత్తూరు జిల్లా ఫలితాలు వస్తాయి. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 టేబుళ్లున్నాయి. అక్కడ కూడా ఫలితాలు వేగంగా వస్తాయి. కృష్ణా జిల్లా నందిగామలో అతి తక్కువగా 7 టేబుళ్లే ఏర్పాటు చేశారు. చాలా నియోజకవర్గాల్లో 18 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు అవుతుంది.
ఎన్నికల సరళి, ఫలితాలను చెప్పడానికి ఈసీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఒక రౌండు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాల్ని కౌంటింగ్ కేంద్రం దగ్గర మైక్‌లో చెబుతారు. అలాగే మీడియా ప్రతినిధులకు కనిపించేలా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు.
👉ఫలితాల విడుదల కోసం app ; ప్రతి రౌండు ఫలితాలను ‘సువిధ’ యాప్‌లో కూడా అప్‌లోడ్ చేయబోతున్నారు.