ప్రస్తుతం గంటగంటకూ పార్టీల్లో, అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. 👉మీరు ఎన్నికల ఫలితాలను మీ స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకోవచ్చు. సువిధ వెబ్‌సైట్ https://suvidha.eci.gov.in/ లో ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తారు రిటర్నింగ్ అధికారులు. సాధారణ ప్రజలు ఎవరైనా సువిధ వెబ్‌సైట్‌లో రియల్‌టైమ్‌లో ఫలితాలు చూడొచ్చు. ఇక అభ్యర్థులు రియల్ టైమ్‌లో ఫలితాలు చూసుకోవడానికి ఎన్నికల కమిషన్ సువిధ యాప్ రూపొందించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కోసం సువిధ యాప్ రూపొందించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 2016లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చెరీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నామినేషన్ దగ్గర్నుంచి ఎన్నికల కమిషన్ నుంచి ఫలితాల వరకు అన్నీ ఈ యాప్‌లో సాధ్యమే. అంతేకాదు… ఇప్పుడు ఫలితాలను కూడా సువిధ యాప్‌లో అందిస్తోంది ఎన్నికల కమిషన్.
మే 23న ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతీ రౌండ్‌లో వచ్చిన ఓట్ల లెక్కల్ని ఎప్పటికప్పుడు సువిధ యాప్‌లో అప్‌లోడ్ చేయనుంది ఎన్నికల కమిషన్. అభ్యర్థులు ప్రతీ రౌండ్‌లో ఓట్ల లెక్కింపును సువిధ యాప్‌లో ట్రాక్ చేయొచ్చు. లోక్‌సభ నియోజకవర్గం మాత్రమే కాదు అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా ఓట్ల లెక్కను చూడొచ్చు. దీని ద్వారా ఓట్ల లెక్కింపును రియల్ టైమ్‌లో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సువిధ యాప్‌లో ఓట్ల లెక్కను అప్‌లోడ్ చేసిన తర్వాతే ఫలితం వెల్లడిస్తారు రిటర్నింగ్ అధికారులు. సువిధ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఎన్నికల కమిషన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంటోంది. ఎన్నికల సమయంలో ఓటర్లకు ఉపయోగపడే యాప్స్‌ని అనేకం రూపొందించింది. 👉సువిధ యాప్ మాత్రమే కాదు… ఓటర్ హెల్ప్‌లైన్, సీవిజిల్, పీడబ్ల్యూడీ లాంటి యాప్స్‌ను రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్.