ఇలా చేస్తే గులాబీ పువ్వు లాంటి అందం..మీ సొంతం..

Spread the love

అందంగా ఉండటానికి అందరూ ప్రయత్నిస్తారు దానికోసం బ్యూటీ ప్రొడక్ట్స్ అని బ్యూటీ పార్లర్స్ అని చాలా ఖర్చు పెడతారు, తెలియక . సాధారణంగా మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాల ద్వారా అందంగా అవడానికి ప్రయత్నించవచ్చు అవేంటో, ఎలాగో చూద్దాం రండి.. మన ఇంటి “రోజ్ బ్యూటీ పార్లర్” కి..

🌹గంధం పొడి, పసుపు, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.
🌹అర టీస్పూన్ కీర రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈమిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
🌹ముల్తానీ మట్టిలో.. చెంచా బంగాళాదుంప గుజ్జు, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.
పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. మర్నాటికి చర్మం తాజాగా తయారవుతుంది.
🌹రోజ్ వాటర్ ని కళ్లచుట్టూ దూదితో అద్దుకుని కాసేపువిశ్రమించాలి.
🌹టమాటా గుజ్జు ఒక టీస్పూన్, పెరుగు ఒక టీ స్పూన్,రోజ్ వాటర్ అర టీ స్పూన్.. బాగా కలిపి ముఖం, మెడ పై
రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్నికడుక్కుని, ఆ తర్వాత చల్లటి నీటితో మరోసారి కడుక్కోవాలి.

🌹కీరదోస రసంలో రోజ్ వాటర్, గ్లిజరిన్ చుక్కలు వేసి ముఖానికిరాసుకుంటే చర్మం నునుపుదనాన్ని సంతరించుకుంటుంది.
🌹నిమ్మరసంలో రోజ్ వాటర్ కలిపి రాత్రి వేళ పడుకునే ముందుముఖానికి రాసుకోవాలి. ఇలా కొద్ది రోజులు క్రమంగా తప్పక చేస్తేముఖంపై మొటిమలు తొలగిపోతాయి.
🌹రెండు టీ స్పూన్ల పసుపులో టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి పేస్ట్చేసి, ముఖం పై అప్లై చేసి ఆరిన తరవాత చల్లటి నీటితో
కడిగేయాలి.

👆 పైన చెప్పిన వీటిలోమీ చర్మతత్వానికి అనువుగా ఉన్నదాన్ని ఎంచుకుని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
👉అలా చెస్తే : గులాబీ పూల మీద ఒట్టు.. గులాబీ లాంటి అందం.. మీ సొంతం అవుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *