విలన్ పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షలకు బాగ దగ్గరయ్యాడు నటుడు సంపత్ రాజ్. ఆయన టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరో సినిమాల్లో మెయిన్ విలన్ గా కనిపిస్తూ ఉంటారు. సంపత్ రాజ్ కు మిర్చి సినిమా ద్వారా బాగా పేరు వచ్చింది. ఆయన చెప్పే డైలాగ్స్ కి ఫిదా కావాల్సిందే. అయితే తాజా గా సంపత్ రాజ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను చెప్పుకొచ్చారు. తాను 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన భార్యని పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. తన భార్యని పెళ్లి చేసుకున్న సమయంలో ఆమెకి సరిగ్గా 19 ఏళ్ళు ఉన్నాయని అందువల్ల కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి అభిప్రాయాలు మరియు లక్ష్యాలు వేరువేరుగా ఉండటంతో ఒకానొక దశలో విడిపోవాలని ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నానని తెలిపారు.
అందుకే విడాకులు తీసుకుని ఇద్దరం వేరు వేరుగా ఉంటున్నామని.. కానీ తన కూతురు బాధ్యతను మాత్రం తానే తీసుకున్నట్లు సంపత్ రాజ్ చెప్పుకొచ్చాడు. అంతేగాక ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తమ మధ్య ఎటువంటి మనస్పర్ధలు కానీ విభేదాలు లేవని ఇప్పటికీ నా కూతురు వాళ్ళ అమ్మని తరచూ కలవడానికి వెళ్తుందని తాను కూడా అప్పుడప్పుడు తన మాజీ భార్య యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటానని తెలిపాడు. ఇంతకి సంపత్ భార్య మనందరికి తెలిసిన నటి శరణ్య. నీరాజనం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె ప్రస్తుతం తల్లిపాత్రలు చేస్తోంది.
Publisher: Adya Media Telugu