మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. స్నానాలని అయిదు రకాలుగా చెప్పినా ముఖ్యమైన స్నానం మాత్రం
నిత్య స్నానం . ప్రతీరోజూ చేసే స్నానాన్ని నిత్య స్నానం.. అంటారు 🔸నిత్య స్నానానికి సమయం ఉంటుందని మీకు తెలుసా : ఔను స్నానానికి సమయం ఉంటుంది. ఒక్కో సమయం లో చేసే స్నానానికి ఒక్కో ఫలితం ఉంటుంది.
♦సమయాన్ని బట్టి స్నానాలు :
👉రుషిస్నానం : తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం
అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు.
👉దేవస్నానం: ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం
అంటారు. ఇది మధ్యమం.
👉మానవస్నానం : ఉదయం 6నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం
అంటారు. ఇది అధమం.
👉రాక్షస స్నానం : ఉదయం 7గంటల తరవాత చేసే స్నానాన్నిరాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం.
👉కాబట్టి…ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం. ♦ఇది చదివాక ఇక నుండి మీరు ఏ సమయానికి స్నానం చేస్తారో..మీరే ఆలోచించుకోండి.