తులసి ప్రతి ఇంట్లో ఎంతో పవిత్రంగా పెట్టుకునే మొక్క లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను కొలుస్తారు.అలాంటి తులసిలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు సైతం దాగున్నాయి. అవేమిటంటే..
🔅యాక్నే సమస్యపై ఇది బాగా పనిచేస్తుంది.మధుమేహవ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది.
రకరకాల క్యాన్సర్ల రిస్కు నుంచి కాపాడుతుంది.హార్మోన్ల సమతుల్యతను కాపాడడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది,విటమిన్ “K “ఇందులో పుష్కలంగా ఉంటుంది.
శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
👉దంతాలను పరిరక్షిస్తుంది. ఓరల్ హెల్త్ కాపాడుతుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో బాగా ఉన్నాయి.
👉మెదడు చురుగ్గా పనిచేసేలా సహకరిస్తుంది,
👉గుండె ఆరోగాన్ని కూడా కాపాడుతుంది.
👉అధిక రక్తపోటును అదుపు లో ఉంచుతుంది .
👉 కాలేయం ఆరోగ్యంగా ఉండేలా పరిరక్షిస్తుంది . నొప్పి తగ్గించే గుణం కూడా తులసి ఆకుల్లో ఉంది .
👉రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది.
👉పోషకపదార్ధాలూ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రేడియేషన్ దుష్పరిణామాలు శరీరంపై పడకుండా పరిరక్షిస్తుంది.
👉ఎముకల నొప్పుల నుంచి వేగంగా సాంత్వనని ఇస్తుంది.
👉𒐯 యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ వైరల్ గా పనిచేస్తుంది .టెస్టోస్టెరాన్లను వృద్ధిచేస్తుంది.
👉 శుక్లాల బారిన పడకుండా కాపాడుతుంది.
కంటి సమస్యలు తలెత్తకుండా నిరోధిస్తుంది.
👉 జుట్టు తెల్లబడనీయదు. కుదుళ్లు పటిష్టంగా ఉండేలా చేస్తుంది . చుండ్రు కు మంచి మందులా పనిచేస్తుంది.వెంట్రుకలు రాలి పోకుండా కాపాడుతుంది.
👉గొంతునొప్పి, దగ్గును నివారిస్తుంది.
👉 బ్లడ్ షుగర్ నిల్వలను క్రమబద్దీకరిస్తుంది. బరువు తగ్గించడంలో కూడా సహకరిస్తుంది. ఇలా ఇన్ని విధాల మేలు చేసే తులసి మొక్క కూడా మనకు అమ్మే.. మనల్ని అన్ని రకాలుగా ఆదుకునే దాన్ని అమ్మ అనే కదా అంటాం…