వైసీపీని కేంద్రకేబినేట్ లోకి ఆహ్వానించాలని కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తోంది .
🔴ప్రయోజనం : 2014లో టీడీపీ ఎన్డీఏలో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. సరిగ్గా ఇప్పుడు కూడా అదే తరహాలో ఏపీ కోటాలో వైసీపీకి కూడా రెండు కేంద్రమంత్రి పదవులు దక్కే చాన్స్ ఉంది. దీంతో వైసీపీ కూడా మోదీ కేబినేట్ లో చేరేందుకు ఆసక్తి కనబరచే అవకాశం లేకపోలేదు. ఏపీ నుంచి కేంద్ర కేబినేట్ లో ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఏపీ నుంచి బీజేపీ ఎంపీలు ఎవ్వరూ లేకపోవడం కూడా వైసీపీకే కేంద్ర కేబినేట్ బెర్తు దక్కేందుకు అవకాశం కల్పించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 22 ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ కేంద్రంలో ప్రాతినిధ్యం దక్కకపోతే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో గొంతు ఎత్తేవారే లేకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో వైసీపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వీలుంది. ఇదిలా ఉంటే మోదీ ప్రభుత్వం ఈ దఫా కూడా ప్రత్యేక హోదా అంశంపై నాన్చుడు ధోరణి అవలంబించాల్సి వస్తే గతంలో టీడీపీకి కేంద్రమంత్రి పదవులు ఇచ్చి కాలం వెళ్లబుచ్చినట్లుగానే, అదే ప్లాన్ ఇప్పుడు కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.
👉అయితే మోదీ ఆఫర్ ను వైసీపీ కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అటు ప్రత్యేక హోదా లేక, కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకపోతే, మొదటికే మోసం వస్తుందని, అప్పడు అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం మద్దతు లేకపోతే మరింత ప్రమాదకరమనే భావన కూడా వైసీపీ వర్గాల్లో ఉంది. మోదీ ప్రభుత్వంతో ప్రస్తుతం ఉన్న సామరస్య పూర్వక ధోరణితోనే పనులు సాగించుకోవాలనే దిశగా ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి పదవులు వస్తే మాత్రం మొదటి చాన్స్ విజయసాయిరెడ్డిని వరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు మాత్రమే కాదు, జగన్ తలలో నాలుకలా మెదిలే విజయసాయి రెడ్డి, రాష్ట్రంలో వైసీపీ విజయానికి వ్యూహరచన చేయడం ద్వారా తన సమర్థతను నిరూపించుకున్నారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ మధ్య తెగదెంపులకు విజయసాయిరెడ్డి వేసిన ప్లానే కారణమని టాక్ ఉంది. అలాగే విజయసాయి రెడ్డి కేంద్రమంత్రిగా ఉంటే మోదీ సర్కారుతో ఎలాగైనా సామరస్యధోరణిని మెయిన్‌టెయిన్ చేస్తూ పనులు చేయించగల చాకచక్యం ఉన్న వ్యక్తిగా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.