భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో
దీపం వెలిగించాలి. కోందరు ప్రొద్దున వెలిగిస్తే మరి కోందరు
పొద్దున్న సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో
అఖండదీపారాధన చేస్తుంటారు.
🙏దీపం ఎందుకు వెలిగించాలంటే : దీపంతో వెలుగు ఏర్పడుతుంది.
చీకటిలో దీపం మనకు త్రోవ చూపించి ధైర్యాన్ని ఇస్తుంది,
దీపం అంటే జ్ఞానం. దీపం మన జ్ఞానాన్ని వెలిగించి మనలోని చెడు అనే చీకట్లను
పారదోలుతుంది.అందుకే మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి
చేయాలి . 👉దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ వుంటుంది. వెలిగే ఆ దీప శిఖ
స్పూర్తిగా మనంఏ ఒక్కరికీ ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడు చేయకుండా వెలుగులు నింపాలి. పవిత్రంగా పైకి ఎగసే ఆ జ్ఞానపు వెలుగులను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా
ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నదే దీప పరమార్థం.
🙏దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని జపించాలి :
“దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే
సర్వం సంధ్యాదీపం నమోస్తుతే”.. ఇలా దీపం వెలిగించి మన లోని చెడుని అహాన్ని ఆవిరి చేయాలి.* అప్పుడే దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుంది.