చాలామందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడి పోతుంది. ఇతర ఆరోగ్య సమస్యల
కారణంగా కూడా ఇలా జరుగొచ్చు. దీనికి కంగారుపడవలసిన అవసరం లేదు సహజ పద్ధతుల ద్వారా తెల్ల జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతుంది.
👉ఆ విధానాలు మీ కోసం ఉసిరిపొడి చేసుకుని అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్నిరోజూ తలకు పూసుకొని రెండు గంటలాగి తలస్నానం చేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
👉ఉల్లిగడ్డను మెత్తగా మిక్సీ చేసి ఈ పేస్ట్‌ను తెల్ల వెంట్రుకలు ఉన్న చోట రాయండి, ఆ తర్వాత రెండు గంటలు ఆగి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరుచుగా
చేయాల్సి ఉంటుంది.
👉కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రోజూ ఈ రసం తలకు పూసుకుంటూ ఉంటే జుట్టు
నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.
👉నువ్వులను మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఇందులో బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని
తరుచుగా తలకు రాస్తుండాలి.
👉రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే కూడా జుట్టు నల్లబడుతుంది.
👉ప్రత్యేకించి : తీసుకునే ఆహారము లో విటమిన్ బి12 ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే నెమ్మది గా తెల్లజుట్టు నల్లగా మారే అవకాశం ఉంటుంది.