సామాజిక దూరం పాటించే సమయంలో ఉద్యోగ విధుల నిర్వహణ ఇలా

Spread the love

ఈ వారం ఎంతో కఠినంగా గడుస్తున్నట్లు అనిపిస్తోంది, కదా? ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ వర్క్ ఎట్ హోమ్ గురించి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు లేదా ప్రస్తుతం ఆ ఆలోచన చేస్తుండవచ్చు.

అంతరాయం లేని ఇంటర్నెట్ నెట్వర్క్, మొబైల్ పరికరాలతో మీరు మీ ఉద్యోగ విధులను క్లౌడ్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు.

ఆఫీస్ నుంచి ఉద్యోగ విధులు ఎలా నిర్వహిస్తారో అంతే తేలికగా ఇంటి నుంచి కూడా పనులను చక్కబెట్టేయవచ్చు. ఇలా రిమోట్ వర్క్ చేసేందుకు మీకు సరైన టెక్నాలజీ మాత్రమే అవసరం.

ఒకటి లేదా రెండు రోజుల పాటు ఇలా ఇంటి నుంచి విధులు నిర్వహించడం అంటే ఏదో కలను సాకారం చేసుకున్నట్లు ఉండవచ్చేమో కానీ, వారం దాటి ఇలా చేయాలంటే మాత్రం విసుగు, కష్టం మాత్రమే కాదు… కొంతమేర స్ఫూర్తి కూడా మిస్ అవుతుంది. ఒకవేళ వర్క్‌ స్పేస్‌కి, లివింగ్ స్పేస్‌కి అంతగా తేడా లేకుండా.. ఇలా ఉద్యోగ విధులు పూర్తి కాగానే అలా వ్యక్తిగత జీవితం మొదలైతే ఎలా ఉంటుంది?

దీనిని సులభం చేయడం కోసం మీకు కొన్ని సులభమైన చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాం:

  1. జాబ్ జీవితాన్నే అనుసరించండి

నిర్ణీత పని గంటలలో మీ విధులను క్రమశిక్షణతో పూర్తి చేయడం అత్యంత ప్రాధాన్యత గల అంశం. అందుకే మీ షెడ్యూల్‌ను ఏ మాత్రం తప్పనివ్వకండి. చక్కగా స్నానం చేయండి, మీ సాధారణ వర్కింగ్ డే మాదిరిగానే ఎంచక్కా డ్రెస్ చేసుకోండి. మీరు ఇంటిలోనే ఉన్నామనే భావన నుంచి ఉద్యోగం చేస్తున్న ఆలోచనకు ఇది సహకరిస్తుంది. మీ బాస్ పక్కన లేనంత మాత్రాన మీరు అదనపు సమయాన్ని సోషల్ మీడియాలో గడపవచ్చని అర్ధం కాదు లేదా మీ కాఫీ బ్రేక్ సమయాలు ఎక్కువ సేపు ఉంటాయని కాదు. మీకు మీరే స్వయంగా బాస్ అయిపోండి ఇంకా స్వీయ నియంత్రణ చేసుకోండి.

  1. ఇతరులతో టచ్‌లో ఉండండి

మీరు పని ప్రారంభించేందుకు ముందుగానే, ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేసుకోండి. మీరు మీ సహోద్యోగులతో లేదా క్లయింట్‌తో వీడియో కాల్ చేయాల్సి ఉంటే, 10 నిమిషాల ముందుగానే ఈ పని చేయండి. మీ పరిసరాలు అన్నీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి.

బయట ఉన్నట్లుగా మీ గది లోపల ఫోన్ కనెక్టివిటీ అంతగా ఉండకపోవచ్చు, కానీ ప్రతీ కాల్ కోసం బాల్కనీలోకి పరుగులు తీయడం అంటే, ప్రొడక్టివిటీని నాశనం చేయడమే అవుతుంది. కాల్‌ డ్రాప్స్‌తో మీ మనశ్శాంతిని పాడు చేసుకునే బదులు, ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్‌కు మారితే? ఇది మీ హోమ్ వైఫై కనెక్షన్‌ను ఉపయోగించి కాల్స్ చేసుకునే వీలు కల్పిస్తుంది, అందుకే కనెక్టివిటీ సమస్యలు దూరం అవుతాయి. మీరు మీ కొలీగ్స్‌కు వాట్సాప్ ద్వారా కాల్ చేయవచ్చు, కానీ మీ బాస్ లేదా క్లయింట్స్‌తో ఇలా చేసేందుకు వీలు పడదు. ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  1. హోమ్‌వర్క్‌కు నో చెప్పేయండి

ఇంటి మధ్యలో కాకుండా ఓ కార్నర్ ఏరియాను ఎంచుకుని, మీ వర్క్‌ స్టేషన్‌ను సృష్టించగలిగితే మీరు ఏకాగ్రత నిలపగలుగుతారు. రోజువారీ పనుల కోసం మీకు అంతరాయం కలిగించవద్దని అలాగే మీ పని ప్రాంతం చుట్టూ తచ్చాడడం చేయవద్దని మీ కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పేయండి. మీ పెంపుడుకుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లడమో లేదా ఏదైనా ఉత్కంఠ కలిగించే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లోని మరో ఎపిసోడ్‌ కానీ మిమ్మల్ని టెంప్ట్ చేయవచ్చు, కానీ వాటికి దూరం పాటించండి. ఎప్పుడూ మీరు చేసే మాదిరిగానే, మీ వ్యక్తిగత పనులు అన్నీ పని గంటల తరువాతే చేయాలని గట్టిగా నిర్దేశించుకోండి.

  1. లాగ్ అవుట్

వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న ఒక ప్రధాన ఇబ్బంది ఏంటంటే, మీరు పని గంటలు మొత్తం సమయం పాటు కేవలం స్క్రీన్‌కు మాత్రమే అతుక్కుపోయి ఉండాలి. పని భారం మీపై ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. మరే ఇతర పని రోజు మాదిరిగానే లాగ్ ఇన్ మరియు లాగ్ అవుట్ చేయడంపై ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించండి. పని గంటలు పూర్తయిన వెంటనే మీ ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేసేయండి, వర్క్ స్టేషన్‌ నుంచి దూరం జరిగి, ఆ పనికి స్వస్తి పలికేయండి.

ఇంటిలోనే ఉన్నంతమాత్రాన ఆ సమయం అంతా బోర్ కొట్టేస్తుందనే అపోహ అవసరం లేదని గుర్తుంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *