మొన్న ఢిల్లీ సమావేశం లో పాల్గొన్న జగన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సైతం జగన్ సమాధానం ఇచ్చారు. తనపై నమోదైన కేసులన్నీ కుట్రలే అనీ.. ఆధారం లేనివే అని అన్నారు.
ఢిల్లీలో జగన్ మీడియాతో మాట్లాడుతన్న సమయంలో శుక్రవారం కోర్టుకు హాజరవుతారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు జగన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
👉జగన్ సమాధానం : తనపై పెట్టిన కేసులేవీ నిలబడేవి కాదన్నారు. ఈ కేసులన్నీ వీగిపోతాయని అన్నారాయన. కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి వైఎస్ఆర్ ఉన్నంత కాలం తనపై కేసులేమీ లేవన్నారు. ఆయన చనిపోయిన తర్వాత…కేసులు మొదలు పెట్టారన్నారు.
🔴 ysr పార్టీ ప్రారంభించిన తర్వాతే: తాను ysr పార్టీ పెట్టినప్పటినుంచే.. అటు కాంగ్రెస్ నాయకులు.. అటు టీడీపీ నాయకులు.. తనపై కక్ష కట్టి పిటిషన్లు వేశారన్నారు. పిటిషనర్లంతా కాంగ్రెస్, టీడీపీ నాయకులే అని అన్నారు. అలాంటి వారు పెట్టిన కేసులు నిలబడవు అన్నారు. ఈ సంగతులన్నీ ఆంధ్రప్రజలకు తెలుసు కాబట్టే తనకు ఇంతటి భారీ విజయం కట్టబెట్టారని.. ప్రజాకోర్టులో నిర్దోషిలా నిరూపించుకున్నానని జగన్ అన్నారు. కోర్టులకు సహకరిస్తానని చెప్పారు.