చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లు బాధపడటం కన్నా ఆరోగ్యం గా ఉండటం చాలా మంచిది.
ఇంకా చెప్పాలంటే ముఖం రంగు కూడా మారుతుంది. ఎండ, దుమ్ము, ధూళి అన్ని కలిసి రంగు మార్చేస్తాయి. అయితే అలాంటి సమస్య ఉన్న వారు ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోండి.చర్మం..
చాల సున్నితమైనది. మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి అంటే… చర్మమనే చెప్పాలి. అయితే ఈ చర్మం దుమ్ము, దూళి భారిన పడి చర్మ సమస్యలు వస్తుంటాయి.
ఈ చర్మం వ్యక్తిగత శుభ్రత లోపం, శారీరక మార్పులు వంటి ఎన్నో కారణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇట్టే తగ్గిపోతాయి.చర్మం..
ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉండగలం.
చర్మం రంగు ఎలాంటిది అయినా సరే.. అది ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే మనం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న కాలంలో పొల్యూషన్, దుమ్ముకి ఎంత ఆరోగ్యమైన ఆహారాన్ని తిన్న సరే ఈ దుమ్ము, దూళి వల్ల చర్మ సమస్యలు వస్తాయి.. అలానే చర్మ రంగుకూడా మారుతుంది.
శనగ పిండిలో పసుపు, రోజ్ వాటర్, పాలు, కలబంద(అలోవేరా) గుజ్జు కలిపి ముద్దలాగా చేసుకొని ముఖానికి పట్టించాలి. ఆ ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత నీటితో కడగాలి. అలాగే మనము దుమ్ము దూళి ఎక్కువుగా ఉన్న చోట్ల తిరగ కూడదు.
దురదలు, దద్దుర్లు వచ్చాయంటే స్నానం చేసే నీటిలో గల్లుల ఉప్పు , ఒక నిమ్మకాయ పిండి ఆ నీటితో స్నానం చేస్తే సమస్య తగ్గి శరీరం కాంతివంతమవుతుంది.
గజ్జి, తామర లక్షణాలు కనిపించిన వెంటనే తులసి ఆకు నూరి అందులో నిమ్మరసం కలిపి పట్టిస్తే లక్షణాలు మాయమవుతాయి.
ఒంటిపై తెల్ల మచ్చలు వస్తే వాటిపై తెల్ల గన్నేరు ఆకులు నూరి పూస్తే మచ్చలు మాయమవుతాయి.
తులసి ఆకు, హారతి కర్పూరం కలిపి నూరి రాత్రిపూట శోభి మచ్చలపై రుద్ది తెల్లారి కడగాలి. ఇలా 3 వారాల పాటు చేస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి.
అరికాళ్లలో ఆనెలు పెరిగితే వారంపాటు జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దితే ఆనెలు తగ్గిపోతాయి.
తేనె, నెయ్యి కలిపి పూస్తుంటే అధిక వేడి వల్ల ఒంటిపై పడిన తీవ్రమైన వ్రణాలు తగ్గిపోతాయి.
పసుపు, ఉసిరి పొడి గ్లాసు నీటిలో కలిపి సేవిస్తుంటే రక్తశుద్ధి జరిగి చర్మ సమస్యలు తగ్గుతాయి.
• నిమ్మకాయ ఆమ్ల గుణం కలది
వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవడంలో తరచుగా దీన్ని ఉపయోగిస్తుంటారు. కొన్ని సార్లు ఇది వ్యతిరేఖ ఫలితాలను చూపుతుంది. ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్లగుణం అధికంగా, పిహెచ్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని నేరుగా మీరు మీ ముఖం పై ఉపయోగించినప్పుడు ఇది చర్మంలో కొన్ని అసౌకర్యాలను కలిగిస్తుంది.
• సున్నితమైన చర్మం
అందం సంరక్షణ విషయానికి వస్తే సున్నితమైన చర్మ సంరక్షణకు ఇది పూర్తిగా వ్యతిరేఖంగా పనిచేస్తుంది. నిమ్మరసంను చర్మంపై ఎక్కువగా వాడటం వల్ల తరచుగా సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. చర్మంలోని నిమ్మరసం తరచుగా వాడటం వల్ల చర్మంపైపై ఎర్రటి-గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు దీనికి ఎక్కువ అవకాశం ఉంది.