సినిమా పేరు ‘అల్లు’

Spread the love

రామ్ గోపాల్ వర్మ ఎవరినైనా టార్గెట్ చేసాడంటే అంత తొందరగా ఎవ్వరినీ ఒదలిపెట్టడు. ఇప్పటికే చంద్ర బాబు, బాలకృష్ణలపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలను తెరకెక్కించి పెద్ద వివాదమే క్రియేట్ చేసాడు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ..’పవర్ స్టార్’ అనే సినిమాను అతి తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించి తనకు సంబంధించిన థియేటర్‌లో విడుదల చేసి సంచలనం సృష్టించాడు.

ఈ సినిమాను వ్యతిరేకిస్తూ పవన్ ఫ్యాన్స్ వర్మపై ఆన్ లైన్‌లోను ఆఫ్ లైన్‌లోను ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత మంది చివరకు వర్మ ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది. అయినా ఎట్టకేలకు ఆయన తన సినిమా పవర్ స్టార్‌ను తన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వర్మ వరల్డ్ థియేటర్‌లో విడుదల చేశాడు.

అది అలా ఉంటే ఆయన మరో వివాదాస్పద సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా పేరు ‘అల్లు’. ఈ సినిమాను చిరంజీవి బామ్మర్ధి అల్లు అరవింద్ పై తెరకెక్కిస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు.

https://platform.twitter.com/embed/index.html?dnt=false&embedId=twitter-widget-0&frame=false&hideCard=false&hideThread=false&id=1289794591852335104&lang=en&origin=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F&theme=light&widgetsVersion=223fc1c4%3A1596143124634&width=550px


ఈ సినిమాను ‘అల్లు’ అనే టైటిల్ పెట్టడానికి రీజన్. ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ ‘అల్లు’తూ ఉంటుందని చెప్పాడు.తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీతో ప్లాన్‌ల అల్లుడులో ఆరితేరిపోయిన ఓ నిర్మాత కథ అని చెప్పాడు. ఆయన పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి ‘అల్లు’డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.అందరితో తనని ‘ఆహా’ అనిపించుకోవడానికి తనకు కావాల్సిన వాళ్లకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్‌ల మీద ప్లాన్ అల్లుకు పోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ ‘అల్లు’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

అంతేకాదు ఈ సినిమాలోని పాత్రల పేర్లు కూడా రివీల్ చేసాడు. ఈ సినిమాలో ఎ.అరవింద్, కే.చిరంజీవి,పవన్ కళ్యాణ్, ఎ. అర్జున్, ఎ.శిరీష్, కె.ఆర్.చరణ్, ఎన్. బాబు వంటి తదితరులు ఉంటారని తెలిపాడు. ఈ సినిమా తీయబోతూ తనకు ఆ కుటుంబం అంటే ఎంతో ప్రేమ అని, తనను నికృష్ణుడు అని పిలిచిన అల్లు అరవింద్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి తీసే సినిమా కాదని వర్మ క్లారిటీ ఇచ్చాడు. కాగా రెండేళ్ల క్రితం శ్రీ రెడ్డి టేకప్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగమని సలహా ఇచ్చింది తానేని వర్మ ఈ సందర్భంగా ప్రకటించాడు. అప్పట్లో అల్లు అరవింద్ .. ఆర్జీవి ఉద్దేశిస్తూ.. నికృష్టుడు, సాప్ట్ మర్దర్ క్రిమినల్ అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిజ జీవిత గాథ అంటూ చెప్పడం కొసమెరుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *