ఆచార్య’ సినిమాకి మణి శర్మ మ్యూజిక్

shiva
Spread the love

90’s లో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ భారీ ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించాడు మణిశర్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో గా ఉండే ప్రతి ఒక్కరితో మణి శర్మ పని చేయడం జరిగింది. అప్పటినుండి 2010 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మణిశర్మ హవా కొనసాగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా కి మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని సాంగ్స్ గాని ఓ రేంజ్ లో మెగా అభిమానులను అలరించేవి. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి అప్పట్లో మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు సినిమా సగం హిట్ అయిపోయిందని అభిమానులు కన్ఫామ్ చేసుకునేవారు.

ఆ తర్వాత ఇండస్ట్రీలోకి దేవిశ్రీ ప్రసాద్ మరియు ఆర్ పి పట్నాయక్ ఇలాంటి కుర్ర మ్యూజిక్ డైరెక్టర్లు ఎంటర్ కావడం తో మణిశర్మ హవా తగ్గిపోయింది.

ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్ గా అప్పట్లో నిలిచిన చాలా సినిమాలకు మణి శర్మ సంగీతం అందించడం జరిగింది. అటువంటి మణిశర్మ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. అయితే తాజాగా మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ సినిమాకి మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా వచ్చిన వార్తకు సంబంధించి సినిమా యూనిట్ ఎక్కడా కూడా అధికారికంగా చెప్పలేదు.

ఇటువంటి తరుణంలో జులై 11 వ తారీకు మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ ప్రాజెక్టుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాట్లు కన్ఫామ్ చేసి, ఆల్రెడీ ఇప్పటికే మూడు అదిరిపోయే సాంగ్స్ రెడీ అయిపోయాయి అని ఖచ్చితంగా మెగా అభిమానులకు నచ్చుతాయని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా దాదాపు పది సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా కి సంగీతమందిస్తున్నా. సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఇద్దరు హీరోల మీద ఓ పాట ఒక డ్యూయెట్ ఉంటాయని మణిశర్మ వెల్లడించారు. మెలోడీ ఎమోషనల్ సాంగ్ డ్యాన్స్ నంబర్.. ఇలా అన్ని రకాల పాటలూ ఈ సినిమాలో ఉంటాయని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *