అక్కినేని నాగేశ్వరరావు ,వాణిశ్రీ జంటగా నటించిన ప్రేమనగర్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. మెగా ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా అతడి జీవితాన్నే మార్చేసింది. అంతలా మలుపు తిప్పిన ఈ సినిమాలో కెవి మహదేవన్ సంగీతం సూపర్భ్. సాంగ్స్ అన్నీ హిట్టే. ఆచార్య ఆత్రేయ మాటలు పేలాయి. ఓ దృశ్య కావ్యంగా మిగిలిన ఈ సినిమా వెనుక ఓ సీక్రెట్ ఉంది. కోడూరి కౌసల్యాదేవి రచించిన నవల ఆధారంగా సినిమా తీయాలని ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి అనుకున్నారట.
వెంటనే నవల హక్కులు కొనేసి శ్రీధర్ ఈ సినిమా అక్కినేని తో తీయాలని భావించారు. అక్కినేని శ్రీమతి అన్నపూర్ణ ఈ నవల మొత్తం చదివి కమర్షియల్ విలువలు కూడా ఉన్నాయని ఒకే చెప్పడంతో సినిమాకు ఒకే చెప్పేసారు.
కె ఆర్ విజయ హీరోయిన్ గా ఖరారు చేశారట. ఈలోగా శ్రీధర్ రెడ్డి కారుకి ఆక్సిడెంట్ అవ్వడంతో ఈ సినిమా ఆపేయాలని శ్రీధర్ రెడ్డి భార్య చెప్పడంతో ఫుల్ స్టాప్ పెట్టేసారు. అయితే ఈ సినిమా తీస్తే బాగుటుందని అక్కినేని చెప్పడంతో రామానాయుడు వెంటనే 60వేలు పెట్టి కొనేశారట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసారు.
హీరోయిన్ గా వాణిశ్రీ ని సెలెక్ట్ చేసారు. ముంగుగా అనుకున్నట్టే డైరెక్టర్ గా కె ఎస్ ప్రకాశరావునే ఖరారు చేసారు. 15లక్షలతో భారీగా తీసిన ఈ మూవీ 1971లో 34ప్రింట్స్ తో విడుదల చేసారు. ఈ సినిమా ఏకంగా 50లక్షలు వసూళ్లు రాబట్టింది. సినిమా విడుదల మొదటి 15రోజులు భారీ వర్షాలైనా సరే,జనం గొడుగులు వేసుకుని మరీ థియేటర్ కి వచ్చి చూసారు. తమిళంలో శివాజీ గణేశన్ ,వాణిశ్రీ లతో రీమేక్ చేసిన రామానాయుడు, ఆతర్వాత హిందీలో రాజేష్ ఖన్నా, హేమామాలినితో తీస్తే అక్కడా సూపర్ హిట్టే. శ్రీధర్ రెడ్డి చేజారిన ప్రేమనగర్ రామానాయుడి పాలిట వరంగా మారింది.