Teluguwonders:
ఏ విషయంపైనైనా ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది ఆ నటి. ఆమె పోషించే పాత్రలే కాకుండా.. ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె చేసే కామెంట్లు కూడా హాట్ హాట్‌గా ఉంటాయ్. 🔥దక్షిణాదిలో ఫైర్ బ్రాండ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె తాజాగా కన్యారాశి సినిమా ప్రమోషనల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్‌గా మారాయి.
💥ఆందోళనకు గురిచేస్తున్న ఆమె కామెంట్స్ :
పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ఇక మీరు కూడా ప్రేమ వివాహం చేసుకొంటారా అనే ప్రశ్నకు వరలక్ష్మీ సమాధానం ఇస్తూ.. జీవితంలో నేను పెళ్లే చేసుకోను. నాకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. కాబట్టి పెళ్లికి నేను దూరంగా ఉంటాను అని స్పష్టం చేశారు. వరలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలనే కాదు.. అభిమానులను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయనే మాట వినిపిస్తున్నది.
🔴విశాల్ తో ఎందుకు చెడింది :
అప్పట్లో హీరో విశాల్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వరలక్ష్మీ, విశాల్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారనే వార్త కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. కానీ అనూహ్యంగా విశాల్, వరలక్ష్మీ దూరం కావడం ఎవరికీ అంతుపట్టలేదు. ఆ తర్వాత విశాల్ హైదరాబాదీ అమ్మాయితో ఎంగేజ్ అవ్వడం తో ఆ వార్తలకు తెరపడింది.
విశాల్‌తో ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడు ప్రస్తావించినా.. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. మా మధ్య అలాంటి బంధానికి అవకాశం లేదు. మా మధ్య ప్రేమ, పెళ్లి గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. మా ఇద్దరి రిలేషన్ ప్రొఫెషన్ వరకే. ఒకవేళ విశాల్ పెళ్లి చేసుకొంటానంటే చాలా సంతోషంగా అతడికి అమ్మాయిని వెతికిపెడుతాను. అతడు పెళ్లి చేసుకొంటే సంతోషించే వాళ్లలో నేను ముందుంటాను అని వరలక్ష్మీ పలుమార్లు స్పష్టం చేసింది.
🔴గతం లో:
ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించింది. మీ జీవితంలో ప్రేమ పుట్టిందా అనే విషయానికి స్పందిస్తూ… “లవ్ అనే ఫీలింగ్ వచ్చింది… పోయింది కూడా. సాధారణంగా పెళ్లి తరువాత ఒక మగాడు తన ఉద్యోగాన్ని వదులుకోడు. కాని నేను మాత్రం పెళ్లి తరువాత… సినిమాలు మానేయాలా? నాకంటూ కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటికి విలువ ఇచ్చే వ్యక్తికి మాత్రమే నా జీవితం లోకి వస్తారు. అలంటి వ్యక్తి నా జీవితంలోకి రాకపోతే… ఒంటరిగా ఉండిపోవడానికి అయినా నేను సిద్ధమే. అంతే తప్పా… ఏదో తోడు కావాలని ఒక వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేను.సమాజం కోసమో, ఇంట్లో వాళ్ళ కోసమో నేను పెళ్లి చేసుకోను. ఆ వ్యక్తి పై నిజంగా ప్రేమ ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా” అని కుండబద్దలు కొట్టినట్టు వరలక్ష్మి చెప్పుకొచ్చారు.
🔴ఆమె సినిమాల విషయానికి వస్తే :
ఆమె గతం లో “పందెం కోడి 2” సినిమాలో విలన్ పాత్రను పోషించారు. అలానే “సర్కార్” సినిమా లో కూడా ఆమె ముఖ్యపాత్ర పోషించింది 👉ప్రస్తుతం నటిస్తున్న కన్యరాశి గురించి మాట్లాడుతూ.. నాకు కొత్త దర్శకులతో పనిచేయడం అంటే చాలా ఇష్టం. ఈ సినిమా స్క్రిప్టు చదివేటప్పుడు పడిపడి నవ్వాను. కథ నచ్చడంతో ఆ తర్వాత వెంటనే ఈ సినిమాలో నటిస్తానని చెప్పాను. ప్రేమ వివాహం ప్రాముఖ్యతను చెప్పే సినిమా కథ అది. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది అని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు.