బాలీవుడ్ భామతో అఫైర్.. నోరువిప్పిన కెఎల్ రాహుల్

Spread the love

Teluguwonders:

భారత క్రికెట్ జట్టుకు సినీ రంగానికి విడదీయరాని అనుబంధం వుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ బంధం మరీ పెనవేసుకుపోయింది. భారత క్రికెటర్ అంటే అతడికి పక్కా ఏదో ఒక సినీతారతో అఫైర్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రచారాలే నిజమవుతున్నాయి. ఇలా ఇటీవల కాలంలో యువ ఆటగాళ్లు కెఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు కొందరు సీనీతారలతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. రాహుల్ విషయంలో అయితే సదరు యువతితో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా తనపై జరుగుతున్న ప్రచారంపై రాహుల్ తాజాగా స్పందించాడు. అయితే తనకు బాలీవుడ్ నటి ఆకాంక్ష రంజన్ కపూర్ తో ఎలాంటి సంబంధం లేదని మాత్రం కరాకండీగా చెప్పలేకపోయాడు.

దీంతో అభిమానులు వీరి రిలేషన్ షిప్ పై ఓ క్లారిటీకి వచ్చారు. వీరి మధ్య ఏదో నడుస్తోందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోను చూస్తేనే అర్థమవుతుందని…ఇప్పుడు రాహుల్ మాటలు దానికి మరింత బలాన్ని చేకూర్చాయని అభిమానులు అంటున్నారు.

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంజన్ కపూర్ తో అనుబంధం గురించి రాహుల్ బయటపెట్టాడు. ” ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం. దానిపై కొన్ని మీడియా సంస్థలు ఊరికే రాద్దాంతం చేస్తున్నాయి. నా వ్యక్తిగత విషయాలను ఎవ్వరితో పంచుకోడానికి ఇష్టపడను. అలాంటిది బహిరంగంగా ఎలా మాట్లాడతాను. నేను ఒంటరిగా వున్నానో… లేక రిలేషన్‌షిప్ లో వున్నానో నాకే తెలియడం లేదు. కాబట్టి నాకు ఓ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు చెబుతాను. అప్పటివరకు దీనిపై అనవసర రాద్దాంతం చేస్తూ నా కెరీర్ పై ప్రభావం పడేలా చేయకండి. ” అని రాహుల్ వెల్లడించాడు.

గతంలో కూడా రాహుల్ తో బాలీవుడ్ హీరోయిన్స్ అతియా శెట్టి, నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్ లతో ప్రేమాయణం కొనసాగుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ప్రముఖ మోడల్, సినీనటి ఆకాంక్ష రంజన్ కపూర్ తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకు బలాన్ని చేకూర్చేలా ఆకాంక్ష రంజన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాహుల్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో కెఎల్ రాహుల్, ఆకాంక్షలు సరదాగా నవ్వుకుంటూ కనిపించారు. దీంతో ఈ పోటో వైరల్ గా మారడం…అభిమానులు రాహుల్, ఆకాంక్షలను ప్రేమ పక్షులుగా పేర్కొంటూ కామెంట్లు చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. తాజాగా రాహుల్ వ్యాఖ్యలు వారి రిలేషన్‌షిప్ ను కన్పర్మ్ చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *