ఆ సినిమా పేరు “హండ్రెడ్ ఇయర్స్ “
వంద సంవత్సరాల తరువాత కూడా వారి పేరు వినిపించాలని నటుడు జాన్ మాల్కోవిచ్, దర్శకుడు రాబర్ట్ రోడ్రిగీజ్ వారు ఇరువురూ ఒక్క గొప్ప సినిమాను తీశారు. అది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని ప్రపంచం భవిష్యత్తులో ఎలా మారబోతుందో చెప్పే విదంగా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించాం అని ఆ చిత్రం గురించి చాలా గొప్పలు చెప్పుకొస్తున్నారు.
👉100 ఏళ్ల తర్వాత వచ్చే సినిమా :
ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చెస్తారొ చెప్పండి అది ఎలా ఉందొ చూసి ఆ సినిమా భవిష్యత్తు ఏంటో మేము తేలుస్తాం అనుకుంటున్నారా. కానీ ఆ సినిమా భవిష్యత్తును మీరు తేల్చడం కాదు కదా ఆ సినిమాను చూడాలంటే మీరు వంద సంవత్సరాల భవిష్యత్తుకు వెళ్ళాలి. అవును నిజమే ఆ సినిమా ఇప్పటి తరం ప్రేక్షకులకోసం కాదంట వంద సంవత్సరాల తరువాతి తరాల వారి కోసం ఈ సినిమాను నిర్మించాం అని చెప్ప18-nov-2115న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు. అంతవరకు ఆ సినిమాకు సంబందించిన డిజిటల్ ప్రింట్లను ఒక బాక్స్ లో పెట్టి ఆ విడులతేదినా తెరుచుకునేవిదంగా టైం సెట్ చేసారంట. మొత్తానికి ఇప్పుడున్న మనకెవ్వరికి ఆ సినిమాను చూసే అవకాశం లేదు అనే చెప్పాలి.