బీచ్‌లో హీరోయిన్.. బికినీలో సెగలు పుట్టిస్తోంది

Spread the love
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ బికినీలో మత్తెక్కిస్తోంది. వరుస సినిమాలతో, షూటింగ్‌తో బిజీగా ఉన్న సారా తన స్నేహితులతో కలిసి కాస్త సేదతీరుదామని ఇటీవల శ్రీలంక వెళ్లింది. అక్కడి బీచ్‌లో బికినీ వేసుకుని సేదతీరుతోంది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘లేడీ ఇన్ లంక’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఫిదా అయిపోతున్నారు. హాట్టెస్ట్ లేడీ ఇన్ శ్రీలంక అంటూ సారా అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. బీచ్ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో సారా బికినీలో వయ్యారంగా నిలబడి కాఫీ తాగుతున్న పోజ్‌కి మాత్రం విపరీతమైన లైక్స్ వచ్చాయి. దాదాపు 13 లక్షల మంది ఈ ఫొటోను లైక్ చేశారు.
బాలీవుడ్ నటుడు, పటౌడీ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె అయిన సారాకు సినిమాల్లోకి రావడానికి పెద్దగా సమయం పట్టలేదు. కానీ ఆమె నటించిన తొలి సినిమా ‘కేదార్‌నాథ్’ రిలీజ్ కాకుండానే ‘సింబా’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ పటౌడీ యువరాణి అందానికి లక్షలాది మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఓ స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫాలోయింగ్ సారాకు ఉంది. ప్రస్తుతం సారా ‘లవ్ ఆజ్ కల్’, ‘కూలీ నెం 1’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ సీక్వెల్ సినిమాలే. సారా నటించిన తొలి సినిమా ‘కేదార్‌నాథ్’ ఒక్కటి అభిషేక్ కపూర్ సొంతంగా రాసుకున్న కథతో తెరకెక్కించారు.
ఆ తర్వాత సారా నటిస్తూ వచ్చిన సినిమాలన్నీ రీమేక్‌లు, సీక్వెల్సే. సారాకు రోజురోజుకీ పెరిగిపోతున్న క్రేజ్‌ చూసి ఆమె డేట్ల కోసం ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు లైన్ కడుతున్నారు. ఎన్నో బ్రాండ్స్ ఆమె చేత టీవీ కమర్షియల్స్ చేయించుకోవాలని ఎదురుచూస్తున్నాయి. అంతేకాదు ఎందరో సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్స్ ఆమెతో ఫొటో షూట్లు చేసి తమ పాపులారిటీని పెంచుకోవాలని అనుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్లు సారా చేత ర్యాంప్ వాక్స్ చేయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత తక్కువ కాలంలోనే బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఏకైక స్టార్ కిడ్ సారా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *