ఎప్పుడో జరిగిపోయిన యుద్ధం అక్కడి వారిని ఇంకా భయపెడుతూనే ఉంది…

Spread the love

రెండో ప్రపంచ యుద్ధం జరిగి 70ఏండ్లు పూర్తయినా కూడా జర్మనీలో పలు చోట్ల అలనాటి బాంబులు లభ్యమవుతున్నాయి. 👉గతేడాది ఏప్రిల్‌లో బెర్లిన్‌ నగరంలో బ్రిటన్‌ సైన్యానికి చెందిన 500కిలోగ్రాముల బాంబు లభ్యమైంది.
అపార్ట్‌మెంట్‌ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో కూలీలు దీన్ని గుర్తించారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు ఏకంగా బెర్లిన్‌లోని 10వేల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే ని అర్థం చేసుకోవచ్చు అది ఎంత ప్రమాదకరమైన బాంబో.. 👉అయితే తాజాగా మరో బాంబు పేలింది. సెంట్రల్‌ ఫ్రాంక్‌ఫర్ట్‌లోని నదీ జలాల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. దీంతో, నదిలోని నీరు దాదాపు 30 మీటర్ల ఎత్తు వరకు ఫౌంటేన్‌లా ఎగిసిపడ్డాయి. జర్మనీ మీడియా సంస్థ డీపీఏ వెల్లడించిన వివరాల ప్రకారం…ఫ్రాంక్‌ఫర్ట్‌లో 250కిలోగ్రాముల యూఎస్‌ వాయుసేనకు చెందిన బాంబు లభ్యమైంది.
ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు బాంబు స్క్వాడ్‌ ప్రయత్నించింది. నదిలోని చేపలను చెదరగొట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే, బాంబు నదీ జలాల్లో అత్యంత లోతులో ఉండటంతో నిర్వీర్యం చేయడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో బాంబు ఒకేసారి భారీ శబ్దంతో పేలింది. బాంబు నీటిలో పేలడంతో అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ఫ్రాంక్‌ఫర్ట్‌ వద్ద 350 మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జర్మనీ రెడ్‌క్రాస్‌ బృందాలు మోహరించినట్టు ఫ్రాంక్‌ఫర్ట్‌ మేయర్‌ పీటర్‌ ఫెల్డ్‌మన్‌ తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడి జనాలు మాత్రం ఇంకా భయం భయం గానే ఉంటున్నారు ఎక్కడ ఎక్కడ బాంబులు ఉన్నాయో తెలియక. అక్కడ యుద్ధం లేకపోయినా భయం మాత్రం ఇంకా బతికే ఉంది*..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *