కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోగా నటించిన యశ్ కెరీర్‌కు ఈ సినిమా మంచి మైలేజ్‌ని ఇచ్చింది. కానీ ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టికి మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలేం రాలేదు. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం, పైగా ఇది యాక్షన్ సినిమా కావడంతో శ్రీనిధికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ అద్భుత అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. కోలీవుడ్ ఎంట్రీకి దారి చూపింది. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధిని తీసుకున్నారు. ‘‘విక్రమ్ సార్‌తో నటించే గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అజయ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీనిధి.