Teluguwonders:
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ పొజిషన్‌పై కన్నేశాడు. ఒకానొక సమయంలో ఎన్నో ఫ్లాపులు పలకరించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ నుంచి అతడు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాతో మొదలు పెట్టి వరుసగా ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత’తో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.
💥ఎన్నో రికార్డులను:
ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో తన మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అదే సమయంలో వ్యాపార ప్రకటనలు కూడా చేస్తూ బిజీ అయిపోయాడు. కొన్ని చానెళ్లకు బ్రాండ్ అంబాసీడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.
👉Nxt అదే:
త్రివిక్రమ్‌తో సినిమా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ, అతడి తర్వాతి చిత్రంపై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అదే.. తారక్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా సమ్మర్ నుంచి స్టార్ట్ కాబోతుందని కూడా ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.
🔴RRR కోసం :
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతున్నాడు.
🔴ప్రచారం ఇలా జరిగింది కానీ :
తారక్ గెటప్‌కు సంబంధించిన పిక్ గురువారం వదులుతారని ప్రచారం జరిగింది.
💥సుభాష్ చంద్రబోస్‌లాఅభయ్ రామ్ ఫొటో:
కానీ, అంతకు మించిన సర్‌ఫ్రైజ్ గిప్టును తారక్ తన అభిమానులకు ఇచ్చాడు. అదే.. ఆయన పెద్ద కుమారుడు అభయ్ రామ్ ఫొటో. స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో అభయ్‌ను ఫ్రీడం ఫైటర్ సుభాష్ చంద్రబోస్‌లా రెడీ చేశారు. దీనికి సంబంధించిన పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. దీనిపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అందరూ చిన్న రాముడిని ఆశీర్వదిస్తున్నారు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
🔴బుల్లి రాముడు బాగున్నాడు:
జూనియర్ ఎన్టీఆర్ గెటప్‌కు సంబంధించిన ఫొటో వస్తుందనుకున్న వారు అభయ్ పిక్ చూసి సంతోష పడిపోతున్నారు. బుల్లి రాముడు ఎంతో అందంగా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. అంతేకాదు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే.. జైహింద్.. భారత్ మాతాకీ జై అంటూ పలు నినాదాలు చేస్తున్నారు. చిరు నవ్వులు చిందిస్తున్న అభయ్ ఫొటోను మీరు కూడా చూసేయండి.