“సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఓటీటీ”

Spread the love

చిత్రలహరి’ సినిమా వరకు సాయి ధరమ్ తేజ్ వరుసగా ఆరు ఫ్లాపులు ఇచ్చాడు. అలాంటి పరిస్థితి నుంచి చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి. అప్పటికి సాయి తేజ్ ఉన్న కెరీర్ గ్రాఫ్‌కు ఈ కథ 100 శాతం సరిపోయింది. దాంతో ప్రేక్షకులు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన మారుతి ‘ప్రతిరోజూ పండగే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా ఈ హీరో ‘సోలో బ్రతుకు సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు. తమన్ సంగీతం అందించిన ఈ పాట థీమ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక లాక్ డౌన్ పుణ్యమాని ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు ప్రేక్షకాదరణ తెగ పెరిగిపోయింది.

దాంతో సినిమాలను విడుదల చేయకుండా అలా వదిలేయడం కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో నేరుగా విడుదల చేయడం బెటర్ అనుకుంటున్నారు పలువురు నిర్మాతలు. థియేటర్ యాజమాన్యాలు అభ్యంతరాలు చెబుతున్నా.. పలువురు నిర్మాతలు ముఖ్యంగా చిన్న నిర్మాతలు అమేజాన్, నెట్ ఫ్లిక్స్, జీ-5, సన్ నెక్స్ట్, ఆహా, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ పామ్స్‌లో సినిమాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.తాజాగా సాయిధరమ్ తేజ్ సినిమాను కూడా ఓటీటీ లో విడుదుల చేయాలని కొన్ని ఫ్లాట్ ఫామ్ కోరుతున్నాయట . ఇందుకోసం ఫ్యాన్సీ రేటును కూడా ఆఫర్ చేస్తున్నాట్టు తెలుస్తుంది. మరి నిర్మాత , మెగా హీరో టెంప్ట్ అయితే ‘సోలో బ్రతుకే సో బెటర్ ‘సినిమా ఓటీటీ లో విడుదల అయ్యే అవకాశంఉంది . చూడాలి మరి ఎం జరుగుతుందో .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *