Teluguwonders:
హీరో బాడీ లాంగ్వేజ్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ సినిమాను కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో దిట్ట ఆ డైరెక్టర్ ఆ విషయాన్ని..ఆయన గత సూపర్ హిట్ చిత్రాలు మిరపకాయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, ఇండస్ట్రీ హిట్ గబ్బర్ సింగ్, సెన్సేషనల్ హిట్ డీజే దువ్వాడ జగన్నాథమ్ వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్సే నిరూపించాయి.
👉ఇక కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తూ ముకుంద, కంచె, అంతరిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2 లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మెగా హీరో మరొకరు. 🌟ఆ హీరో యంగ్ అండ్ టాలెంటెడ్ మెగా ప్రిన్స్. వరుణ్ తేజ్ అయితే, ఆ డైరెక్టర్ హరీష్ శంకర్ . వీరి సంచలన కలయికలో రూపొందుతోన్న చిత్రం వాల్మీకి.
🔥వాల్మీకి:
ఈ సినిమా లో..వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండగా.. తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది.
🔴టీజర్ ఎలా ఉందంటే:
వాల్మీకి టీజర్ అత్యంత ఇంటెన్సిటీతో కనిపించింది. ట్రైలర్‌లోని డైలాగ్స్ దర్శకుడు హరీష్ శంకర్ మార్కును రుచిచూపించాయి.
💥కేక పెట్టిస్తున్న డైలాగ్స్ :
“నా సినిమాలో విలనే హీరో.. అందుకే పెద్దోళ్లు చెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్స్ సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలి.. రెండు దాచుకోవాలి “అని వరుణ్ చెప్పిన డైలాగ్స్ కేక పెట్టించాయి. టీజర్‌లో సంగీతం కూడా ఆకట్టుకొన్నది. సన్నివేశాలను హైలెట్ చేస్తూ మంచి ఫీల్‌ను అందించింది. మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
👥నటీనటులు:
వరుణ్ తేజ్, అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి తదితరులు .
👉ఫైట్స్: వెంకట్
👉ఆర్ట్: అవినాష్ కొల్ల
👉ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్
👉సంగీతం: మిక్కి జె.మేయర్
👉నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
👉స్క్రీన్ ప్లే: మధు శ్రీనివాస్, మిథున్ చైతన్య
👉దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్
💥క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వాల్మీకి సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు యూనిట్.