మీకు ఒక విషయం తెలుసా? మామూలుగా మనుషులకి సిటి స్కాన్ చేస్తారు కదా. అదేవిధంగా పురాతన వస్తు శాఖ వాళ్లు వాళ్లకి ఏదైనా పురాతనమైన విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని మనిషికి చేసినట్టే సిటి స్కాన్ చేస్తారు. అదేంటి విగ్రహాన్ని ఎందుకు స్కాన్ చేస్తారు అనుకుంటున్నారా? ఎందుకంటే విగ్రహం లోపల ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అలా స్కాన్ చేస్తారు.
నెదర్లాండ్స్ లోని డ్రెంట్స్ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని శాస్త్రవేత్తలు స్కాన్ చేశారు. ఆ స్కానింగ్ లో తెలిసిన విషయం ఏంటంటే, ఆ విగ్రహం లో ఒక మనిషి శవం ఉందట.
ఆ శవం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందటిది.