దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు

Spread the love

తూర్పు గోదావరి జిల్లా ఆంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు సెప్టెంబరు 9న భాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా దేవాదాయశాఖ సహాయ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవో గా భధ్రాజీ పని చేశారు.

Know more about temple

https://en.wikipedia.org/wiki/Antarvedi

SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE, ANTHARVEDI

అంతర్వేది స్వామివారి రథం

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు అన్నారు. సొమ‌వారం బ్రాహ్మ‌ణ వీధిలోని దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెదపాటి అమ్మాజీతో క‌లిసి ఆయ‌న మాట్లాడారు.

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా….కావాలని ఎవరన్నా చేసిందా? అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 ల‌క్ష‌ల రూపాయ‌లతో అంతర్వేది  రథం నిర్మాణం జ‌రిగే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *