జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల ను నెరవేరుస్తూ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గా ప్రస్తుతం పేరు సంపాదించుకున్నారు. అంతే కాదు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అంతే కాదు అందరికీ మెరుగైన విద్య ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
పేద విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపించేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్ సర్కార్..
ఇక ఆ తర్వాత జగనన్న విద్యా కానుక ద్వారా ప్రజలకు కావాల్సిన అన్ని వస్తువులను పంపిణీ చేశారు… అంతేకాకుండా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్ రూపురేఖలను మార్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. ఇక అటు వ్యవసాయాభివృద్ధి లో కూడా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ ఇతర రాష్ట్రాలకు సైతం ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. జగన్ పాలనలో సుపరిపాలన అందుతుంది అన్నది ఇటీవల ఓ సర్వేలో కూడా వెల్లడైంది.
Zapపబ్లిక్ ఎఫైర్ సెంటర్ ఇచ్చినటువంటి నివేదికలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుపరిపాలన లో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఈ ర్యాంకులో మొదటి స్థానంలో కేరళ నిలిచింది. ఒక తమిళనాడు సుపరి పాలనలో రెండవ స్థానంలో నిలిచింది. కర్ణాటక నాలుగో స్థానంలో నిలవగా… తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచింది… గుజరాతి 9 వ స్థానంలో నిలిచింది. కాగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను పరిగణలోకి తీసుకుని రాంకులు ఇచ్చింది పబ్లిక్ ఎఫ్ఫైర్స్ సెంటర్.