రాష్ట్రంలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం

Spread the love

💥రాష్ట్రంలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం

👉జోన్ల తర్వాతే రాజధాని మార్పు

🌻విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలు

🌻బోర్డు పరిధిలో చైర్మన్ తో పాటూ ఏడుగురు సభ్యులు

🌻చైర్మన్ కు క్యాబినెట్ హోదా

🌻అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు

👉ఆ నాలుగు జోన్లు ఏవంటే..

అన్ని జిల్లాలు కలిపి మొత్తం నాలుగు జోన్లుగా విభజిస్తారు.

★విజయనగరం
★కాకినాడ
★గుంటూరు
★కడప

జోనల్ కేంద్రాలుగా గుర్తించబోతున్నారు.

🔹విజయనగరం జోన్:

దీని పరిధిలోకి మూడు జిల్లాలు వస్తాయి.

1.విశాఖ,
2.శ్రీకాకుళం,
3.విజయనగరం

🔹కాకినాడ జోన్:

👉దీని పరిధిలోకి మూడు జిల్లాలు వస్తాయి.

1.తూర్పు గోదావరి
2.పశ్చిమగోదావరి
3.కృష్ణా

🔹గుంటూరు జోన్:

దీని పరిధిలోకిమూడు జిల్లాలు వస్తాయి.

1.నెల్లూరు
2.ప్రకాశం
3.గుంటూరు

🔹కడప జోన్:

ఈ జోన్ పరిధిలో సీమలోని నాలుగు జిల్లాలు ఉన్నాయి.

1.చిత్తూరు
2.కర్నూలు
3.అనంతపురం
4.కడప

🌺ఒక్కో జోన్ కు ఒక్కో ప్రత్యేకత..

రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే నాలుగు జోన్లు వేటికవే ప్రత్యేకంగా నిలబడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా జోన్లలోని ప్రత్యేకత పరిస్థితులు, అక్కడ అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాల దృష్ట్యా వేర్వేరు వ్యూహాలను జగన్ సర్కారు సిద్దం చేస్తున్నది.

🔹విజయనగరం జోన్:

పరిధిలోకి వచ్చే కొత్త రాజధాని విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మైనింగ్, గిరిజన సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు.

🔹కాకినాడ జోన్ :

ఆక్వా, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యమిస్తూ చర్యలు చేపడతారు.

🔹గుంటూరు జోన్:

పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోర్టులు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇస్తారు.

🔹కడప జోన్ :

హార్టికల్చర్, చిరుధాన్యాల బోర్డు, ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.

👉జోన్ల చైర్మన్లకు మంత్రి హోదా..

ఏపీ సర్కారు కొత్తగా ఏర్పాటు చేయనున్న నాలుగు రీజనల్ డెవలప్మెంట్ జోన్ల పర్యవేక్షణ కోసం భారీ సెటప్ రూపొందించబోతున్నట్లు సమాచారం. బోర్డు పరిధిలో చైర్మన్ తోపాటు ఏడుగురు సభ్యులు ఉండేలా కమిటీ ఉంటుందని, ఆయా జోన్ల చైర్మన్లకు కేబినెట్ ర్యాంకు హోదా కూడా కల్పించబోతున్నారని తెలుస్తోంది. మంత్రి పదవితో సమానంగా జోన్ల చైర్మన్లను ట్రీట్ చేయబోతున్నారన్న సమాచారం అధికార వైసీపీ నేతల్లోని ఆశావాహులకు తీపి కబురులా మారింది. మంత్రి పదవులు ఆశించి, చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన ఎమ్మెల్యేలు, గతంలోనే జగన్ నుంచి మాట పొందిన ఇతర కీలక నేతలు ఈ పదవుల కోసం పోటీపడే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *