వంటలకు గోదావరి జిల్లాలు ప్రసిద్ధి. ఇక అక్కడ దొరికే చేపల గురించి తలచుకుంటే చాలు నోరూరాల్సిందే.
ఆ పక్కనే వున్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇప్పుడు చీరమేను సందడి చేస్తోంది.
ముందుగా అక్టోబరు రెండో వారంలోనే కనిపించింది.
చూడ్డానికి చిన్నగా కనిపించినప్పటికీ దీని రుచి అమోఘం. గ్లాసు, తవ్వ, సేరు, క్యారేజీ, బిందెలు, బకెట్లలో కొలిచి అమ్ముతుంటారు. యానాంలో సేరు చీరమేను రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పలుకుతోంది.
అయినా లెక్క చేయకుండా భోజనప్రియులు ఆ చేపల కోసం ఎగబడుతున్నారు.
వీలైతే ఒక్కసారి మీరూ రుచి చూడండి బాస్!