* పటమట, న్యూస్‌టుడే: ఇండేన్ గ్యాస్ సిలిండర్ (ఎల్‌పీజీ) రీఫిల్ బుకింగ్‌కు దేశవ్యాప్తంగా ఒకే ఫోన్ నంబర్‌ను నవంబరు1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్‌పీ ఫుల్‌జిలే తెలిపారు. విజయవాడ భారతీనగర్‌లోని ఐఓసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 77189 55555 నంబర్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. 75888 88824 నంబర్‌కు వాట్సప్ చేయడం ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు.