అమరావతిలో ఇంగ్లీష్ చిచ్చు..! తెలుగులో మొదలైన నేతల యుద్దం..! ఫైర్ అవ్వనున్న పవన్..!!

Spread the love

అమరావతి/హైదరాబాద్ : అమరావతిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్నటి వరకూ ఇసుక కొరత మీత అట్టుడికిన అమరావతి ఒక్క సారిగా మలుపు తీసుకుంది. అందుకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెర తీసారు. రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేస్తే పరవాలేదుగానీ వ్యక్తిగత ఆరోపణలు చేసి కొత్త వివాదానికి శ్రీకాంరం చుట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యల పట్ల జనసైనికులు ఎవ్వరూ ఆవేశానికి లోనుకావద్దని, సంయమనంగా ఉంగాలని పిలుపునివ్వడంతో సమస్య ఎంత తీవ్రంగా పరిణమించిందో తెలుస్తోంది. ఇదే అమరావతిలో మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఏపి సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు రాబోతున్నారు. పవన్ పై వ్యక్దిగత వ్యాఖ్యలు చేసిన జగన్ పట్ల కూడా గబ్బర్ సింగ్ వ్యక్తిగతంగానే స్పందిస్తారా అనే అంశం అమరావతి వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే అంశం పట్ల ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ స్పందించాల్సి ఉంది.

నవంబర్ 11వ తారీఖున జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఏపి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా ఏపి ప్రభుత్వం ప్రాథమిక విద్యనుంచే సంస్కరణలు తీసుకురావలని భావించింది. అందుకోసం ఓ జీవోను కూడా విడుదల చేసింది. అసలు వివాదం రగలడానికి ఇదే కారణంగా మారింది. గతంలో తెలుగు బాష కళ్ల లాంటిది., ఇంగ్లీష్ భాష కళ్లద్దాల వంటిదని చెప్పిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని, తెలుగు భాషకు సముచిత స్ధానం కల్పించాని గతంలో పలుసార్లు ప్రయత్నించిన చంద్రబాబు నాయుడును, తెలుగు భాషను పరిరక్షించుకోవాలని పేర్కొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఏక కాలంలో టార్గెట్ చేసారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *