కేంద్రంలో గెలిచేది ఎవరో ఎగ్జిట్ పోల్స్ చెప్పేసాయి..!!!

Spread the love

తాజాగా విడుదలైన Exit పోల్స్ ఫలితాలు దేశమంతా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
ఈ రోజు వెల్లడైన టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే అంచనాల ప్రకారం రాబోయే ఎలక్షన్స్ ఫలితాలలో బీజేపీమిత్రపక్షాలుతో సంపూర్ణ మెజారిటీ సాధించనుందని తెలుస్తుంది.

ఔను.. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని టైమ్స్‌నౌ-వీఎంఆర్ సర్వే అంచనా వేసింది.

🎙కారణం : పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయుసేన పాక్‌లోని బాలాకోట్‌పై దాడులు చేయడంతో ప్రజల్లో ఎన్డీయే ప్రతిష్ఠ బాగా పెరిగిందని ఆ సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా 16,931మందిని ప్రశ్నించిన తర్వాత వచ్చిన అంచనా ఇది :

👉లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయే కూటమికి 283, యూపీఏకు 135, ఇతరులకు 125 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. . ఈ సర్వే వివరాలిలా ఉన్నాయి. పంజాబ్, జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాలలో ఎన్డీయే కూటమి ప్రభావం ఉంటుంది. ఎన్డీయే తన ఓట్ల శాతాన్ని 38.5 శాతం నుంచి 40 శాతానికి పెంచుకోగలదు.
♦యూపీఏ ఓట్ల శాతం :
గత ఎన్నికల్లో 23 శాతం ఓట్లను మాత్రమే పొందిన యూపీఏ ఈసారి 30.6 శాతం ఓట్లను సాధించేల్ అవకాశముంది.

👉ఎన్డీయే భారీ విజయాలను నమోదు చేసే ప్రాంతాలు : ఈశాన్యంలోనూ,హిందీ ప్రాంత రాష్ట్రాల లోను ఎన్డీయే భారీ విజయాలను నమోదు చేయవచ్చు. 🔸మధ్యప్రదేశ్‌లో 29కి 22, రాజస్థాన్‌లోని 25లో 20, ఛత్తీస్‌గఢ్‌లోని 11 సీట్లలో ఆరింటిని ఎన్డీయే కూటమి గెలుచుకోగలదు. 👉ఈ మూడు రాష్ర్టాల్లోనూ మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

🔴బీజేపీ కి అవకాశం లేని ప్రాంతాలు : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టే పరిస్థితులున్నాయి. ఆ రాష్ట్రంలో ఎస్పీ-బీఎస్పీకి 36, ఎన్డీయేకు 42 సీట్లు వచ్చే అవకాశముంది. ♦ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ భారీ విజయాలను నమోదు చేయవచ్చు. బీహార్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానాలో ఎన్డీయే ఆధిపత్యం కొనసాగుతుంది. ♦కర్ణాటక, జార్ఖండ్ రాష్ర్టాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశముంది. 👉కేరళ, తమిళనాడులో యూపీఏ కూటమి ఆధిపత్యం చూపగలదు అని సర్వే తెలిపింది.

🎙ఆంధ్రప్రదేశ్‌లో గెలిచే పార్టీలు: 👉ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, 👉తెలంగాణలో టీఆర్‌ఎస్ భారీ విజయాలను నమోదు చేయగలవని ఈ సర్వే అంచనా వేసింది.చూద్దాం ఏం జరుగుతుందో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *